Site icon HashtagU Telugu

Jagan Covid Review Meet : కోవిడ్‌ పరిస్థితులపై సీఎం సమీక్ష

Ffxp31avkaoazoz Imresizer

Ffxp31avkaoazoz Imresizer

కోవిడ్‌లో ఒమిక్రాన్‌ లాంటి కొత్త వేరియంట్‌ నేపథ్యంలో మార్పు చేయాల్సిన మందుల విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సీఎం జ‌గ‌న్ ఉన్న‌తాధికారుల‌ను సూచించారు. ఆమేరకు హోం కిట్‌లో మార్పులు చేయాలి, వైద్యనిపుణులతో సంప్రదించి ఇవ్వాల్సిన మందులను సిద్ధంచేయాల‌ని చెప్పారు. మ‌రోవైపు అత్య‌వ‌స‌ర స‌మ‌యాల్లో 104 కాల్‌ సెంటర్‌ను బలంగా ఉంచాలన్నారు. ఎవరు కాల్‌చేసినా వెంటనే స్పందించేలా తగిన చర్యలు తీసుకోవాలన్న సీఎం, కోవిడ్‌ కేర్‌ సెంటర్లను కూడా సిద్ధం చేయాలని ఆదేశాలు జారీ చేశారు. వీటితో పాటు మ‌రికొన్ని సూచ‌న‌లు కూడా చేశారు సీఎం జ‌గ‌న్‌.