Site icon HashtagU Telugu

CM Jagan: భారీ వర్షాలపై సీఎం జగన్ సమీక్ష!

Ys Jagan Mohan Reddy Video Con 1200x768 Imresizer

Ys Jagan Mohan Reddy Video Con 1200x768 Imresizer

రాష్ట్రంలో కురుస్తున్న ఎడతెరిపిలేని వర్షాలు, వరదలపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమీక్ష చేపట్టారు. శ్రీకాకుళం నుంచి ఏలూరు జిల్లా వరకు కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. ఈ సందర్భంగా గోదావరి ఉధృతి, వరద సహాయక చర్యలపై సీఎం జగన్‌ దిశనిర్దేశం చేశారు. ఈ సమావేశంలో హోం మంత్రి తానేటి వనిత, వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి పాల్గొన్నారు.

రాష్ట్రంలో కురుస్తున్న విస్తార వర్షాలు, గోదావరి నదికి వరద నీరు చేరడంతో జాతీయ విపత్తు స్పందనా దళాలు NDRF బృందాలు రంగంలోకి దిగాయి. విశాఖపట్నంలో రెండు, అల్లూరి సీతారామరాజు జిల్లాకు మరో రెండు బృందాలను మోహరింపచేయగా.. మరో రెండు బృందాలను సన్నద్ధంగా ఉంచినట్లు అధికారులు వెల్లడించారు. ఈ బృదాలు కృష్ణా జిల్లా గన్నవరం మండలం, కొండపావులూరు గ్రామం నుంచి విశాఖ, అల్లూరి సీతారామరాజు జిల్లాలకు వెళ్లాయి. వీటితో పాటు అధికవర్షాలు కురుస్తున్న తెలంగాణా, కర్నాటక రాష్ట్రాలకు 11 NDRF బృందాలను కొండపావులూరు నుంచి పంపినట్లు అధికారులు తెలిపారు.