Site icon HashtagU Telugu

CM Jagan: రెండు రోజులపాటు ఏపీ సీఎం జగన్ బిజీ షెడ్యూల్, పూర్తి వివరాలివే

Jagan

Jagan

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి(CM Jagan) రెండు రోజుల పాటు బిజీబిజీగా గడపనున్నారు. ఇవాళ ఉదయం 10గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి ప్రకాశం జిల్లా టంగుటూరు మండలం కారుమంచి చేరుకుంటారు. కొండెపి నియోజకవర్గ వైస్సార్ సీపీ ఇంచార్జీ వరికూటి అశోక్ బాబు నివాసంలో ఆయన తల్లి భౌతికకాయానికి నివాళుర్పిస్తారు. అనంతరం అక్కడి నుంచి బయలుదేరి ఒంటిగంటకు తాడేపల్లి గెస్ట్ హౌజ్‎కు చేరుకుంటారు. సాయంత్రం 5గంటలకు రాజ్‎భవన్‎లో గవర్నర్‎తో ప్రత్యేకంగా జగన్ భేటీ అవుతారు. అయితే గవర్నర్‎ను ప్రత్యేకంగా కలవడంలో కారణమేంటో తెలియదు. తాజా రాజకీయ పరిణామాలపై చర్చించే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. ముఖ్యంగా ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలపై ఈ సమావేశంలో చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

కాగా మంగళవారం విశాఖలో పర్యటించనున్నారు జగన్. మంగళవారం సాయంత్రం 4గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి విశాఖకు చేరుకుంటారు. సాయంత్రం రిషికొండ రాడిసన్ బ్లూ రిసార్ట్స్ చేరుకుంటారు. జీ 20 డెలిగేట్స్ తో ఇంటరాక్షన్ కార్యక్రమం ఉంటుందని తెలుస్తోంది. ఆ తర్వాత గెస్టులకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన డిన్నర్ లో పాల్గొంటారు. రాత్రి 8గంటలకు విశాఖ నుంచి బయలుదేరి 10 గంటలకు తాడేపల్లికి చేరుకుంటారు.