Site icon HashtagU Telugu

CM Jagan : తెలంగాణ హైకోర్టును ఆశ్రయించిన ఏపీ సీఎం ‘జగన్’..!

ఆంధ్రప్రదేశ్‌ సీఎం జగన్‌ మంగళవారం తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. ఎన్నికల నియమావళి ఉల్లంఘించారన్న కేసును కొట్టివేయాలని క్వాష్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. 2014లో హుజూర్‌నగర్‌ లో జగన్‌ మోహన్ రెడ్డి ఎన్నికల నియమావళి ఉల్లంఘించారని ఆయనపై కేసు నమోదైన సంగతి తెలిసిందే. అనుమతి లేకుండా రోడ్‌ షో నిర్వహించారని జగన్ పై అభియోగం నమోదైంది. దీంతో విచారణకు హాజరు కావాలని ఇటీవల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్‌ మోహన్ రెడ్డికి ప్రజాప్రతినిధుల కోర్టు నుంచి సమన్లు జారీ అయ్యాయి. ఈ నేపథ్యంలోనే ముఖ్యమంత్రి జగన్‌ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు.

Exit mobile version