Site icon HashtagU Telugu

CM Jagan : జ‌గ‌న్న‌న్న తోడు నిధులు విడుద‌ల చేసిన సీఎం జ‌గ‌న్

Cm Jagan

Cm Jagan

సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి జ‌గ‌న‌న్న తోడు నిధుల‌ను త‌న క్యాంప్ కార్యాల‌యంలో విడుద‌ల చేశారు. చిన్నతరహా వ్యాపారులకు పెట్టుబడి సాయంగా ఏడో విడత ఔజగనన్న తోడును అందజేశారు. ఈ సందర్భంగా వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మాట్లాడుతూ చిరు వ్యాపారులను ఆదుకోవడంతోపాటు వారికి పెట్టుబడి సాయం అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం జగనన్న తోడు పథకాన్ని ప్రవేశపెట్టిందన్నారు. ఈ పథకం ద్వారా 5,10,412 మంది లబ్ధిదారులు లబ్ధి పొందారని తెలిపారు. జగనన్న తోడు పథకాన్ని ఇప్పుడు మరో 56 వేల మందికి వర్తింపజేస్తున్నట్లు ముఖ్యమంత్రి జ‌గ‌న్ తెలిపారు. ఈ పథకం ద్వారా చిరు వ్యాపారులకు ఆర్థిక సహాయం, వృద్ధి అవకాశాలను అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. గతంలో తీసుకున్న రుణాలను తిరిగి చెల్లించిన వారికి వడ్డీ మొత్తాన్ని ప్రభుత్వం నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తుంది. అదనంగా,వారి మునుపటి వాయిదాలను తిరిగి చెల్లించిన వారికి రుణ మొత్తాన్ని పెంచుతున్నారు.