Site icon HashtagU Telugu

Jagan Tweet: కరోనా నుంచి కోలుకోవాలంటూ బాబుకు జగన్ ట్వీట్!

Babu And Jagan

Babu And Jagan

టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. ఆయన వైద్యుల సూచన మేరకు ఇంట్లో నే ట్రీట్ మెంట్ తీసుకుంటున్నారు. తనను కలిసినవాళ్లంతా టెస్టులు చేయించుకోవాలని, టీకాలు వేయించుకోవాలని బాబు కోరారు. ఈ నేపథ్యంలో ఏపీ సీఎం జగన్ రెడ్డి ట్వీట్ చేశారు. ‘‘మీరు త్వరగా కోలుకోవాలి.. ఆరోగ్యంగానూ ఉండాలి’’ చంద్రబాబునాయుడి ఉద్దేశించి ట్వీట్ చేశారు. కాగా నారా లోకేశ్ కరోనా బారిన పడిన విషయం మరువముందే.. టీడీపీ అధ్యక్షుడు కూడా చంద్రబాబు నాయుడు కు కొవిడ్ పాజిటివ్ అని తేలడంతో టీడీపీ శ్రేణుల్లో ఆందోళన నెలకొంది. ఇక టీడీపీ మాజీ మంత్రి దేవినేనికి కరోనా అని తేలడంతో మరింత టెన్షన్ నెలకొంది.