AP CM: డూప్లికేట్‌ రిజిస్ట్రేషన్లకు చెక్‌ పెడతాం!

  • Written By:
  • Updated On - January 18, 2022 / 01:25 PM IST

ఇకపై డూప్లికేట్‌ రిజిస్ట్రేషన్లకు చెక్‌ పెడతామని, దళారీ వ్యవస్థ రద్దు అవుతుందని ఆంధ్రప్రదేశ్  ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పేర్కొన్నారు. 37 గ్రామాల్లో స్థిరాస్తుల రిజిస్ట్రేషన్‌ సేవలను గుంటూరు జిల్లా తాడేపల్లిలోని తాన క్యాంప్‌ కార్యాలయం నుంచి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో సీఎం జగన్ మాట్లాడుతూ గ్రామ కంఠాల్లోని స్థిరాస్తుల సర్వే, యాజమాన్య ధ్రువీకరణ పత్రాలు ఇస్తామని, అన్ని గ్రామ సచివాలయాల్లోనే స్థిరాస్తుల రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ ఉంటుందని స్పష్టం చేశారు. 11,501 గ్రామాల్లో డిసెంబర్‌ 2022 నాటికి రీసర్వే పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తెలిపారు.