Site icon HashtagU Telugu

Mahesh Babu: మహేశ్ నోటా.. జగన్ మాట!

Mahesh

Mahesh

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ పరుశురామ్ పెట్లా దర్శకత్వంలో ‘సర్కారు వారి పాట’  (Sarkaru Vaari Paata) సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా నుంచి  నుంచి కళావతి అనే సాంగ్‌‌ను విడుదల చేస్తే మంచి రెస్పాన్స్ వచ్చింది. థమన్ స్వరపరిచిన ఈ మెలోడీ సాంగ్ ఇప్పటి వరకు ఈ సినిమా యూట్యూబ్‌లో 150 మిలియన్ పైగా  వ్యూస్ రాబట్టి దూసుకుపోతోంది. తాజాగా మూవీ టీం సినిమాకు సంబంధించిన ట్రైలర్ ను విడుదల చేశారు. అందరి అంచనాలను నిజం చేస్తూ ట్రైలర్ అన్ని వర్గాలను ఆకట్టుకునేలా ఉంది. ఈ ట్రైలర్‌తో ఈ సినిమాపై అంచనాలు పెరిగాయి.

ముఖ్యంగా మహేష్ బాబు చెప్పిన డైలాగులు అదిరిపోయాయి. నా ప్రేమను దొంగలించగలవు. నా స్నేహాన్ని దొంగలించగలవు  కానీ నా డబ్బులు దొంగలించ లేవు అన్న మహేష్ బాబు డైలాగులు బాగున్నాయి. నేను విన్నాను.. నేను ఉన్నాను అంటూ ఏపీ సీఎం జగన్ చెప్పిన డైలాగులు చెప్పడం అదిరిపోయింది. ముఖ్యంగా మ్యారేజ్ చేసుకునే వయసొచ్చిందటావా.. ఊరుకోండి సార్.. మీకు పెళ్లేంటి… చిన్న పిల్లాడివైతేను. అందరు నీలాగే అనుకుంటున్నారు. ఇక్కడ దూల తీరిపోతుందని  డైలాగ్ తో పాటు.. ట్రైలర్ చివర్లో పెళ్లి కొడుకు గదికి వచ్చినట్టు వచ్చారు అనే డైలాగ్స్ పేలాయి. అయితే గతంలో టికెట్ల రేట్ల విషయమై మహేశ్ బాబు సైతం సీఎం జగన్ భేటీ అయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ‘‘నేను విన్నాను.. నేను ఉన్నాను’’ డైలాగ్స్ పలకడం అటు అభిమానుల్లో, ఇటు టాలీవుడ్ లోనూ ఆసక్తి రేపుతోంది. ఆచార్యకు టికెట్ల రేట్ల పెంపునకు పర్మిషన్ ఇచ్చినా ఏపీ ప్రభుత్వం.. సర్కారు వారి పాటకు కూడా ఆఫర్ ఇస్తుందా? అనేది వేచి చూడాల్సిందే.

Exit mobile version