ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి బుధవారం విశాఖపట్నంలో పర్యటించారు. ముందుగా విశాఖలోని చినముషిడివాడలో ఉన్న శారదాపీఠం వార్షికోత్సవాలకు జగన్ మోహన్ రెడ్డి హాజరయ్యారు. రాజశ్యామల యాగం కోసం ముఖ్యమంత్రి జగన్ తో పండితులు సంకల్పం చేయించారు. అనంతరం అమ్మవారికి ఏపీ సీఎం జగన్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. తొలుత శారదాపీఠంలోని విజయ గణపతి, శంకరాచార్య, వనదుర్గ ఆలయాలను ముఖ్యమంత్రి సందర్శించారు. ఆ తర్వాత జగన్ చేతుల మీదుగా కలశస్థాపన చేశారు. పూజా కార్యక్రమాల అనంతరం శంకరాచార్య వేద పాఠశాల విద్యార్థులకు ఉత్తీర్ణత పత్రాలు, పతకాలను జగన్ అందజేశారు. సీఎం జగన్ విశాఖపట్నం పర్యటనలో మంత్రులు వెల్లంపల్లి శ్రీనివాస్, అవంతి తో పాటు జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.
CM Jagan: విశాఖ శారదాపీఠానికి ఏపీ సీఎం… అమ్మవారికి జగన్ ప్రత్యేక పూజలు!

jagan