CM Chandrababu : అసెంబ్లీ సమావేశలో భాగంగా ఈరోజు సాగునీటి రంగం పై చర్చ జరిగింది. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ..నదుల అనుసంధానం జరిగితే నీటి సమస్య ఉండదని తెలిపారు. గతంలోనే పోలవరం కుడి కాలువ నిర్మాణం పూర్తి అయిందని తెలిపారు. గొదావరి, కృష్ణానదులను అనుసంధానం చేశామని తెలిపారు. కేంద్రం జలజీవన్ మిషన్ నిధులు ఇస్తుందని తెలిపారు. పరిశ్రమల అవసరానికి నీటిని సరఫరా చేస్తామని చంద్రబాబు పేర్కొన్నారు.
తమ ప్రభుత్వం 2019లో అధికారంలోకి వస్తే.. 2021లోపు పోలవరం ప్రాజెక్ట్ పూర్తి అయ్యేదని తెలిపారు. అయితే 2019 నాటికి పోలవరం 70 శాతానికి పైగా పూర్తి అయింది. 2019లో ప్రభుత్వం మారింది. దీంతో రివర్స్ ట్రేడింగ్ జరిగిందని చంద్రబాబు అన్నారు. తమ ప్రభుత్వ హయాంలో రాయలసీమకు నీళ్లు ఇచ్చామని తెలిపారు. ఏడాదిలో పట్టిసీమను పూర్తి చేశామని తెలిపారు. ఒకే రోజు 32వేల క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ పనులను ప్రారంభించామని తెలిపారు. పోలవరం ఏపీకి జీవనాడి, వెన్నెముక అని చంద్రబాబు తెలిపారు.
మరోవైపు అసెంబ్లీలో పోలవరం ప్రాజెక్టుపై చర్చ జరిగింది. ఈ చర్చ సందర్భంగా మంత్రి నిమ్మల రామానాయుడు పోలవరం ప్రాజెక్టు గురించి వివరించారు. డయాఫ్రం వాల్ ఉందో లేదో తెలియకుండా మాట్లాడుతున్నారని ఆయన మండిపడ్డారు. ఫేజ్ – 1, ఫేజ్ – 2 అని ఏ రోజూ మేం చెప్పలేదన్నారు. పోలవరంతో పాటుగా చింతలపూడి, హంద్రీనీవాలపై సీఎం చంద్రబాబు సమీక్ష చేస్తున్నారన్నారు. గత ఐదేళ్ల పాలనలో ఇరిగేషన్‌ను విధ్వంసం చేయడమే లక్ష్యంగా పని చేశారని విమర్శించారు.