Another shock to TDP : చంద్రబాబు బయటకు రాకుండా ఏపీ సర్కార్ మరో పిటిషన్..

రాష్ట్రంలో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో బాబు ను మొత్తంగా జైలు కే పరిమితం చేయాలనే ఆలోచన చేస్తుంది జగన్ సర్కార్

  • Written By:
  • Publish Date - September 11, 2023 / 02:43 PM IST

స్కిల్ డెవలప్‌మెంట్‌ (Skill Development Case) కేసులో చంద్రబాబు (Chandrababu) ను జైల్లో పెట్టిన వైసీపీ సర్కార్ (YCP Govt)..ఇప్పుడు ఆయన్ను బయటకు రాకుండా మరిన్ని కేసులు పెట్టేందుకు సిద్ధమైంది. రాష్ట్రంలో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో బాబు ను మొత్తంగా జైలు కే పరిమితం చేయాలనే ఆలోచన చేస్తుంది జగన్ సర్కార్. అందుకే పాత కేసులన్నింటినీ బయటకు తీస్తుంది. ప్రస్తుతం స్కిల్ డెవలప్‌మెంట్‌ కేసు నుండి చంద్రబాబు ను ఎలా బయటకు తీసుకరావాలా..అని టిడిపి వర్గాలు , లాయర్లు భావిస్తుంటే..వైసీపీ సర్కార్ మరో షాక్ (Another shock ) ఇచ్చింది.

అమరావతి ఇన్నర్ రింగ్‌ రోడ్డు (Amaravathi Inner Ring Road Case)లో అక్రమాలకు పాల్పడ్డారన్న కేసులో విచారణకు కోర్టులో పిటిషన్ వేసింది. 2022లో నమోదైన ఈ కేసులో విచారించేందుకు అనుమతి ఇవ్వాలని ఏసీబీ కోర్టు (ACB Court)లో పీటీ వారెంట్‌ దాఖలు చేసింది. ఒకవేళ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో చంద్రబాబుకు బెయిల్ వచ్చిన వెంటనే ఇన్నర్ రింగ్‌రోడ్డు కేసులో అరెస్టు చేసేందుకు సిఐడీ సిద్దమవుతున్నట్లు తెలుస్తుంది. అందుకే కోర్టులో పిటిషన్ మూవ్ చేసింది. కేవలం కాగితాలకే పరిమితం చేసి అమరావతి ఇన్నర్‌ రింగ్‌ రోడ్‌ ప్రాజెక్ట్‌ పేరుతో దోపిడీ చేశారని 2022లో ప్రభుత్వం సీఐడీ విచారణ ఆదేశించింది. అలైన్‌మెంట్‌ను నచ్చినట్టు మార్చేశారని.. ఫలితంగా వేల కోట్ల రూపాయలు అనుయాయలకు దోచి పెట్టారని పేర్కొంది. అంతే కాదు నారాయణ (Narayana) ఈ అవినీతిలో భాగమై ఉన్నారని ప్రభుత్వం పేర్కొన్నది. ఆ అవినీతిలో భాగంగానే లింగమనేని రమేష్‌తో కుమ్మక్కై ఆయన భవనంపై ఉంటున్నారని వైసీపీ (YCP) ఎప్పటి నుంచో ఆరోపిస్తూ వస్తోంది. మొదట 94 కిలోమీటర్లకే ఇన్నర్ రింగ్ రోడ్డును పరిమితం చేసిన అధికారులపై ఒత్తిడి తీసుకొచ్చి అలైన్‌మెంట్‌ మార్చారని ఆరోపిస్తోంది. ఈ మార్పు కారణంగా చంద్రబాబుతోపాటు అనుయాయలు భారీగా లబ్ధి పొందారని ఆరోపిస్తుంది. ఈ కేసును విచారించిన సీఐడీ ఏ-1గా చంద్రబాబును, ఏ-2గా నారాయణను, ఏ-3గా లింగమనేని రమేశ్‌ను, ఏ -6గా నారా లోకేష్‌ను ఉంచింది. ఇప్పుడు ఈ కేసునే తెరపైకి తీసుకొచ్చి చంద్రబాబును అష్టదిగ్బంధం చేయాలని ప్రభుత్వం చూస్తోంది. మరి ఈ కేసులో ఏంజరుగుతుందో చూడాలి.

Read Also : Chandrababu: 14 ఏళ్ళ ముఖ్యమంత్రికి 14 రోజుల రిమాండ్.. దేవుడి స్క్రిప్ట్..!

మరోపక్క వైసీపీ నేతలు ..చంద్రబాబు ఇక జైలుకే పరిమితమని..బయటకు వచ్చే ప్రసక్తే లేదని..అస్సలు బయటకు రానివ్వం అని ధీమా వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు దేశంలోనే అతిపెద్ద ఆర్థిక ఉగ్రవాది అని మంత్రి రోజా అన్నారు. బోగస్ కంపెనీలకు బాబు బ్రాండ్ అంబాసిడర్, అవినీతి అనకొండ అంటూ పెద్ద పెద్ద మాటలే రోజా అనుకుంటూ వచ్చింది. సాక్ష్యాధారలతో దొరికారు కాబట్టే చంద్రబాబుకు రిమాండ్ విధించారని, చంద్రబాబు కడిగిన ముత్యం కాదని, అవినీతిలో కూరుకుపోయిన మట్టి ముత్యం అని విమర్శించారు. చంద్రబాబుపై చాలా కేసులు ఉన్నాయని, ఫైబర్ గ్రిడ్, పోలవరం, పట్టిసీమ, అమరావతి భూములు, అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులు చాలా ఉన్నాయని వాటన్నింటిలో ఆధారాలు దొరికితే మళ్లీ మళ్లీ అరెస్ట్ చేస్తామని, ఇది ప్రారంభం మాత్రమేనని, ముగింపు కాదన్నారు. తొందర్లోనే లోకేష్, అచ్చెన్నాయుడిని అరెస్ట్ చేస్తారని, అందుకు వారు సిద్ధంగా ఉండాలన్నారు.