Site icon HashtagU Telugu

AP Cabinet Meeting : నేడు ఏపీ కేబినెట్ భేటీ… ప‌లు కీల‌క ఆంశాల‌పై చ‌ర్చ‌

Ap Cabinet

Ap Cabinet

ఏపీ సీఎం జ‌గ‌న్‌ మోహ‌న్ రెడ్డి అధ్య‌క్ష‌త‌న నేడు మంత్రివ‌ర్గ స‌మావేశం జ‌ర‌గ‌నుంది. రాష్ట్ర మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ తర్వాత మంత్రివర్గం రెండోసారి సమావేశం కానుంది. రాష్ట్రపతి నామినేషన్ సందర్భంగా ఎన్డీయే అభ్యర్థి ద్రౌపది ముర్ముకు మద్దతుగా ఢిల్లీకి వెళ్లేందుకు సీఎం జ‌గ‌న్ సిద్ధ‌మ‌వ‌గా.. చివరి నిమిషంలో జగన్ తన ఢిల్లీ పర్యటనను వాయిదా వేసుకుని.. కేబినెట్ సమావేశం యధావిధిగా కొనసాగుతుందని మంత్రులకు సమాచారం అందించారు.

అమ్మ ఒడి పథకం అమలుపై జూన్ 27న తల్లీబిడ్డల ఖాతాల్లోకి అందజేసే అంశంపై మంత్రివర్గం చర్చించనుంది. ఇటీవల ధావోస్‌లో సీఎం జగన్‌ సంతకం చేసిన ఒప్పందాల అమలులో భాగంగా రాష్ట్రంలోని పెట్టుబడి కంపెనీలు, గ్రీన్‌ ఎనర్జీ కంపెనీలకు భూముల కేటాయింపునకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది. ఇటీవల జరిగిన సమావేశంలో తీసుకున్న నిర్ణయాలకు కేబినెట్ ఆమోద ముద్ర వేయనుంది

అదానీ గ్రూప్ ఏపీలో త్వరలో ప్రారంభించనున్న అధానీ గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టుకు కేబినెట్ ఆమోదం తెలిపే అవకాశం ఉంది. అదేవిధంగా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టులకు త్వరలో అనుమతి లభించే అవకాశం ఉంది. 8వ తరగతి విద్యార్థులకు కూడా మాత్రల పంపిణీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది. కృష్ణా జిల్లా మల్లవెల్లి ఫుడ్ పార్కులో రూ.150 కోట్లతో అవిసా ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ రొయ్యల ప్రాసెసింగ్ పరిశ్రమకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది.