Site icon HashtagU Telugu

AP Cabinet: ఏపీ కెబినెట్ భేటీ వాయిదా.. కార‌ణం ఇదే..?

మార్చి 3న జరగాల్సిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం మార్చి 7వ తేదీకి వాయిదా పడింది. ఫిబ్రవరి 21న గుండెపోటుతో మరణించిన దివంగత మంత్రి గౌతమ్ రెడ్డి పెద్ద‌క‌ర్మ నేపథ్యంలో స‌మవేశాన్ని వాయిదా వేయాల‌ని ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకుంది. అయితే మార్చి 7న అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కావాల్సి ఉండగా..

తొలిరోజు గవర్నర్ ప్రసంగం అనంతరం కేబినెట్ సమావేశం జరగనుంది. బడ్జెట్ సమావేశాలను ఇరవై రోజుల పాటు నిర్వహించాలని ప్రభుత్వం యోచిస్తోంది. అయితే దీనిపై బీఏసీ సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నారు. అసెంబ్లీలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టడమే కాకుండా, ప్రభుత్వం కొన్ని బిల్లులను ముఖ్యంగా మూడు రాజధాని బిల్లు మరియు ఉద్యోగుల పదవీ విరమణ వయస్సు పెంపుపై బిల్లును తీసుకురానుంది. మరోవైపు ఈ సమావేశాలకు టీడీపీ హాజరవుతుందా లేదా అనే చర్చ సాగుతోంది.