Site icon HashtagU Telugu

AP Govt: 16 కొత్త మెడికల్ కాలేజీలకు కేబినెట్ ఆమోదం!

శుక్రవారం సమావేశమైన ఆంధ్రప్రదేశ్ కేబినెట్ రాష్ట్రంలో 16 కొత్త మెడికల్ కాలేజీల నిర్మాణానికి రూ.7,880 కోట్లు ఖర్చు చేసేందుకు ఆమోదం తెలిపింది. ఇప్పటికే ఉన్న 11 మెడికల్ కాలేజీలను అభివృద్ధి చేసేందుకు ఈ సమావేశంలో రూ.3,820 కోట్లు మంజూరు చేసింది. ఇవే కాకుండా.. కోవిడ్‌తో మరణించిన ఉద్యోగుల కుటుంబాలకు కారుణ్య ప్రాతిపదికన ఉద్యోగాలు కల్పించడం, అనకాపల్లి ప్రాంతీయ వ్యవసాయ సంస్థను ఏర్పాటు చేయడం, గ్రోత్ పాలసీ కింద AP ఇండస్ట్రియల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ వినియోగ భూములు గురించి కొన్ని కీలక నిర్ణయం తీసుకుంది.