Site icon HashtagU Telugu

Somu Veerraju : జ‌గ‌న్ స‌ర్కార్ పై 28న ప్ర‌జాగ్ర‌హ స‌భ‌

Somu Veerraju

Somu Veerraju

ఏపీ ప్ర‌భుత్వ ప్ర‌జా వ్య‌తిరేక విధానాల‌పై ఈనెల 28న‌ ప్రభుత్వంపై ప్రజా ఆగ్రహం సభను ఏపీ బీజేపీ నిర్వ‌హించ‌నుంది. ఆ రోజు మ‌ధ్యాహ్నం ఒంటిగంట నుంచి సాయంత్రం 5 గంట‌ల వ‌ర‌కు బ‌హిరంగ స‌భ, దీక్ష కొన‌సాగుతుంద‌ని ఆ పార్టీ అధ్యక్షుడు సోము వీర్రాజు వెల్ల‌డించాడు. బ‌హిరంగ స‌భ‌ను విజ‌య‌వంతం చేయడానికి భారీగా ప్ర‌జ‌ల త‌ర‌లిరావాల‌ని పిలుపునిచ్చాడు. విలేక‌రుల స‌మావేశంలో ఆయ‌న జ‌గ‌న్ స‌ర్కార్‌పై మండిప‌డుతూ వీర్రాజు చేసిన వ్యాఖ్య‌లు సంక్షుప్తంగా ఇవి.

జగన్ పాలనలో వందల హిందూ ఆలయాలను కూల్చి వేశారు. ఒక్కరి పై కూడా ఇంతవరకు కేసు పెట్టలేదు. రధం దగ్ధంతో… హిందువుల మనసులు దగ్ధం అయ్యాయి. చర్చి మీద ఎవడో రాళ్లు వేస్తే.. వెంటనే కేసులు పెట్టారు. జగన్ ను క్రిస్టియన్ వాది అనాలా… అసమర్ధుడు అనాలా ? హిందువులు దేవుళ్ల నగలను బాండ్స్ గా మారిస్తారా? వాటిని కూడా తాకట్టు పెట్టి డబ్బు తెచ్చు కుంటాడు. ఎపి లో ప్రభుత్వం కట్టించే చర్చిల నిర్మాణాలు ఆపివేయాలి. ఫాదర్లకు డబ్బులు ఇవ్వడం‌పై కోర్ట్ లో పోరాడతాం.బిసి జన గణన పేరుతో జగన్ మోసం చేస్తున్నాడు. మోడీ ని ప్రధానిగా చేశాం… బిసిని సిఎం చేసే ధైర్యం ఉందా ?ఎపి లో బ్లాక్ మెయిల్ రాజకీయ పార్టీలు పెరిగాయి .స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కు వ్యతిరేకమని మేము కూడా చెప్పాం. మీరు మాత్రం పాల డైరీలను అమ్మేసుకోవచ్చా… మా పై నిందలు వేస్తారా? బ్లాక్ మెయిల్ పాలిటిక్స్ చేసే వారిని బిజెపి నడి రోడ్డు మీద నిలబెడుతుంది.
అభివృద్ధి విషయంలో చర్చించేందుకు మేము సిద్దం. దమ్ముంటే జగన్, చంద్రబాబు ఒకే వేదిక పైకి రావాలి. అన్ని వృత్తుల వారిని జగన్ ప్రభుత్వం మోసం చేసింది. బాధతో ప్రజలు రోడ్డెక్కితుంటే… జగన్ మాత్రం ప్యాలెస్ ను‌ వీడడు. మద్యపాన నిషేధం అన్నవాడు.. మద్యం ధర తగ్గించామని గొప్ప గా చెబుతాడా? పేద ప్రజల‌ జీవితాలను ఫణంగా పెట్టి కోట్లు కొల్లగొడతారా? ఇసుక ప్రైవేటీకరణ చేసి… ప్రజలపై భారం మోపారు.
ఎపిలో మూతపడిన పరిశ్రమ లను తెరవలేని దద్దమ్మలు మీరు. ఇవన్నీ వదిలేసి… స్టీల్ ప్లాంట్ పల్లవి అందుకుంటారా? ప్రెస్, మీడియా కూడా మోసం చేసిన వారిని ప్రశ్నించదు. ఆ ప్రశ్నలు కూడా మాకే… మేమే సమాధానం చెప్పాలి. డబ్బు లు కేంద్రం ఇస్తే… సోకులు రాష్ట్ర ప్రభుత్వానిదా? పధకాలకు ఇచ్చే డబ్బులు మళ్లించి… బిల్లులు ఆపుతావా? గ్రామాల అభివృద్ధి కి సర్పంచ్ లకు డబ్బులు వేశాం. మోడీ వేసిన డబ్బులను కూడా జగన్ లాగేసుకున్నాడు.
చంద్రబాబు, జగన్ లు స్టిక్కర్ బాబులు… వీళ్లతో అభివృద్ధి సాధ్యం కాదు. బ్లాక్ మెయిల్ పాలిటిక్స్ చేసే వారిని తరిమి కొట్టాలి. రాజధాని విషయంలో బిజెపి వైఖరి స్పష్టం.. మళ్లీ మళ్లీ చెప్పాల్సిన అవసరం లేదు. రాజధాని రైతులను నాశనం చేసింది చంద్రబాబు. ఆనాడే అభివృద్ధి చేసి ఉంటే… నేడు రైతులు రోడ్డెక్కే పరిస్థితి ఉండేది కాదు. జగన్ మాయమాటలతో ఏమార్చి… మోసం చేశారు. కక్ష కట్టి భూములు ఇచ్చిన రైతులను రోడ్డు మీదకు లాగారు.

Exit mobile version