AP BJP : బీజేపీ ఎంపీ అభ్యర్థులపై క్లారిటీ.!

  • Written By:
  • Publish Date - March 11, 2024 / 07:17 PM IST

ఏపీలో రాజకీయాల్లో ఇప్పుడు దృష్టి అంతా టీడీపీ (TDP)- జనసేన (Janasena)- బీజేపీ (BJP) కూటమి పైనే ఉంది. ఈ కూటమి నుంచి ఎవరు ఎక్కడి నుంచి పోటీ చేస్తారోనని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ మూడు పార్టీల్లో ఎవరిని లోక్‌ సభ, అసెంబ్లీ సీట్లు దక్కుతాయని చర్చించుకుంటున్నారు. అయితే.. ఇప్పటికే టీడీపీ – జనసేన నుంచి అభ్యర్థుల తొలి జాబితా విడుదలైన విషయం తెలిసిందే. అయితే.. తాజాగా ఈ పొత్తులోకి బీజేపీ వచ్చి చేరడంతో 6 అసెంబ్లీ, 6 లోక్‌ సభ స్థానాల్లో పోటీ చేసేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది.

We’re now on WhatsApp. Click to Join.

టీడీపీ-బీజేపీ కూటమిలో బీజేపీకి కేటాయించిన ఆరు లోక్‌సభ స్థానాలకు అభ్యర్థుల ఎంపిక ఖరారైంది. కింది అభ్యర్థులను త్వరలో అధికారికంగా ప్రకటించాలని భావిస్తోంది కూటమి. అందులో.. రాజమండ్రి నుంచి దగ్గుబాటు పురందేశ్వరి (Daggubati Purandeshwari), హిందూపురం నుంచి సత్యకుమార్ (Satya Kumar), ఏలూరు నుంచి సుజనా చౌదరి (Sujana Chowdary), రాజంపేట నుంచి నల్లారి కిరణ్‌కుమార్ రెడ్డి (Nallari Kiran Kumar Reddy), అనకాపల్లి నుంచి సీఎం రమేష్ (CM Ramesh), అరకు నుంచి కొత్తపల్లి గీత (Kothapalli Geetha) పోటీ చేయనున్నారు. అయితే.. జనసేన కోటా నుంచి బీజేపీకి ఒక ఎంపీ సీటు దక్కినట్లు సమాచారం. కూటమిలో టీడీపీ ఐదు లోక్‌సభ స్థానాలను మాత్రమే కేటాయించగా, బీజేపీ, జనసేన సమన్వయంతో జనసేనకు కేటాయించిన సీట్లలో ఒక ఎంపీ సీటు, 3-4 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేసేందుకు ఒప్పందం కుదుర్చుకున్నట్లు సమాచారం.

మిత్రపక్షాల మధ్య విభేదాలను నివారించడం ఈ ఏర్పాటు లక్ష్యం. నర్సాపురం సిట్టింగ్ ఎంపీ రఘు రామకృష్ణం రాజు (Raghu Rama Krishnam Raju) నర్సాపురం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తారని మొదట్లో అంచనాలు నెలకొన్నాయి. అయితే పొత్తుకు అనుగుణంగా సుజనా చౌదరి ఇప్పుడు అదే జిల్లాలోని ఏలూరు నుంచి పోటీ చేయనున్నారు. ఒకే జిల్లాలో రెండు ఎంపీ సీట్లు ఒకే పార్టీకి ఇచ్చే పరిమితి కారణంగా నర్సాపురం నుంచి టీడీపీ అభ్యర్థిగా రఘురామకృష్ణంరాజు (ఆర్‌ఆర్‌ఆర్‌) పోటీ చేయవచ్చని ప్రచారం జరుగుతోంది. అయితే బీజేపీ అధిష్టానం మాత్రం ఆర్‌ఆర్‌ఆర్‌కు టికెట్ ఇవ్వలేదని వార్తలు వచ్చాయి.

Read Also : Ghazipur Bus Accident: హై టెన్షన్ వైర్ తగిలి బస్సుకు మంటలు, ఆరుగురు మృతి