Site icon HashtagU Telugu

YCP vs BJP : విజ‌య‌సాయిరెడ్డిపై సుప్రీం చీఫ్ జస్టిస్‌కు ఫిర్యాదు చేసిన ఏపీ బీజేపీ చీఫ్ పురంధేశ్వ‌రి

Purandhareswari

Purandhareswari

వైఎస్‌ఆర్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డిపై సుప్రీం చీఫ్ జ‌స్టిస్‌కు ఏపీ బీజేపీ అధ్య‌క్షురాలు పురంధేశ్వ‌రి ఫిర్యాదు చేశారు. గత పదేళ్లుగా బెయిల్‌ షరతులను ఉల్లంఘిస్తూ అక్రమాలకు పాల్పడుతున్నారని, ప్రజలను బెదిరిస్తున్నారని ఆరోపిస్తూ ఆమె పిర్యాదు చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో మద్యం, ఇసుక తవ్వకాలకు సంబంధించి విజయసాయిరెడ్డి అక్రమాలకు పాల్పడ్డారని పురంధేశ్వ‌రి ఆరోపించారు. అయితే దగ్గుబాటి పురంధేశ్వరిపై వైఎస్సార్‌సీపీ నేత, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ట్విట్టర్‌లో కౌంట‌ర్ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్‌లో పురందేశ్వరి టీడీపీకి మద్దతు ఇస్తుందా అని ప్రశ్నించారు. వ్యక్తిగత ప్రయోజనాల కోసమే పురంధేశ్వరి బీజేపీలో చేరారని.. ఆమె టీడీపీకి విధేయత చూపుతున్నారని ఆరోపించారు. ఇటీవ‌ల పురంధేశ్వ‌రి ఏపీలో మ‌ద్యం కుంభ‌కోణం జ‌రిగింద‌ని ఆమె ఆరోపించారు. ప్ర‌భుత్వ మ‌ద్యం దుకాణాల్లో నాసిరకం మ‌ద్యం అమ్మూతూ ప్ర‌జ‌ల ప్రాణాలను ప్రభుత్వం తీస్తోందంటూ ఆమె ఆరోపించారు.

Exit mobile version