Site icon HashtagU Telugu

AP BJP: ఓటు కు లిక్కర్..

Somu Veerraju

Somu Veerraju

ప్రజాగ్రహ సభలో ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోమూవీర్రాజు చేసిన ప్రకటన వివాదాస్పదంగా ఉంది. అధికారంలోకి బీజేపీ వస్తే చిప్ లిక్కర్ కేవలం 75 రూపాయలకు ఇస్తామని హామీ ఇచ్చాడు. రాబడి బాగుంటే 50 రూపాయలకు చీప్ లిక్కర్ పేదలకు ఇస్తామని వెల్లడించడం చర్చనీయాంశంగా మారింది. జాతీయ పార్టీ బీజేపీ ఇలాంటి ప్రకటన చేయడం పై సామాన్యులు సైతం ముక్కున వేలేసుకుంటున్నారు.

రెవెన్యూ బాగుంటే, ఛీప్ లిక్కర్ యాభై రూపాయలకే ఇస్తారా….!
అది మీ ఎన్నికల హామీనా…!?
కోటి మంది తాగే వాళ్ళు వున్నారు కాబట్టి కోటి ఓట్లు వేస్తే ఈ హామీ తీరుస్తారా….!!?
ఇలాంటి ప్రకటన బహిరంగ సభలో ప్రకటిస్తారా….!? అంటూ బీజేపీ నేత వీర్రాజు ను సోషల్ మీడియాలో ఏకి పారేస్తున్నారు. జరిగిన పొర బాటును దిద్దుకునే పనిలో బీజేపీ ఉంది. ఆ పార్టీ శ్రేణులు పెట్టిన ప్రజాగ్రహాసభ ఈ ప్రకటనతో చులకనగా మారింది. దీనికి బీజేపీ నేతలు ఏమి చెబుతారో చూడాలి.