Chiken: తెలంగాణపై ఏపీ బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్, చికెన్ వ్యాపారుల విలవిల

  • Written By:
  • Publish Date - February 21, 2024 / 06:12 PM IST

Chiken: ఏపీలో బర్డ్ ఫ్లూ విస్తృతంగా వ్యాప్తి చెందుతుంది ఇప్పటికే ప్రభుత్వం దీని మీద దృష్టి పెట్టినప్పటికీ కూడా చాలా ప్రాంతాల్లో చికెన్ అమ్మకాలు నిలిపివేశారు. ముఖ్యంగా నెల్లూరు ఒంగోలు విజయవాడ గుంటూరు లాంటి ప్రాంతాల్లో బర్డ్ ఫ్లూ ప్రభావం ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఈ ప్రాంతాల్లో చికెన్ తినాలంటేనే నగరవాసులు బెంబేలెత్తిపోతున్నారు.

ఏపీలోని పౌల్ట్రీ పరిశ్రమలకు బర్డ్ ఫ్లూ వణుకు పుట్టిస్తోంది. గత వారం నెల్లూరు జిల్లాలో బర్డ్ ఫ్లూ వల్ల పెద్ద సంఖ్యలో కోళ్లు చనిపోయాయి. దాంతో ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తమై ఆయా జిల్లాలను హెచ్చరించింది. పౌల్ట్రీలు ఎక్కువగా ఉన్న కృష్ణా, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, నెల్లూరు, ప్రకాశం, కడప, అనంతపురం జిల్లాల్లో ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్‌లను ఏర్పాటు చేసింది.

తెలంగాణ వ్యాప్తంగా చికెన్ అమ్మకాలు గణనీయంగా పడిపోయాయి ఇదే పరిస్థితి కొనసాగితే మరొక రెండు మూడు రోజుల్లో చికెన్ షాపులు తెలంగాణ వ్యాప్తంగా మూతపడే అవకాశాలు ఉన్నాయని పౌల్ట్రీ వ్యాపారులు ఆందోళన చెందుతున్నారు. ఇందుకు కారణం బర్డ్ ఫ్లూనే. ఒక్కసారిగా చికెన్ పట్ల ప్రజలు ఇంత భయపడడం బర్డ్ ఫ్లూ కారణమని అంటున్నారు వ్యాపారస్తులు.