AP Assembly : నేటి నుంచి ఏపీ అసెంబ్లీ స‌మావేశాలు.. చంద్ర‌బాబు మిన‌హా హాజ‌రుకానున్న టీడీపీ ఎమ్మెల్యేలు

ఏపీ అసెంబ్లీ స‌మావేశాలు నేటి నుంచి(గురువారం) ప్రారంభంకానున్నాయి. ఈ స‌మావేశాల్లో ప్ర‌భుత్వం ప‌లు కీల‌క బిల్లుల‌ను...

  • Written By:
  • Publish Date - September 15, 2022 / 06:58 AM IST

ఏపీ అసెంబ్లీ స‌మావేశాలు నేటి నుంచి(గురువారం) ప్రారంభంకానున్నాయి. ఈ స‌మావేశాల్లో ప్ర‌భుత్వం ప‌లు కీల‌క బిల్లుల‌ను ప్ర‌వేశపెట్టే అవ‌కాశం ఉన్న‌ట్లు తెలుస్తోంది. ప్ర‌ధానంగా మూడు రాజ‌ధానుల బిల్లు స‌భ‌లో పెట్ట‌నున్న‌ట్లు సమాచారం. అయితే ఈ బిల్లుపై ఇప్ప‌టికే న్యాయ‌స్థానాల్లో కేసు న‌డుస్తుండంటంతో ఇబ్బందులు రాకుండా ఉండేందుకు పాల‌న వికేంద్రీక‌ర‌ణ అనే అంశంపై స‌భ‌లో చ‌ర్చ‌ను లేవ‌నెత్తాల‌ని అధికార పార్టీ ఆలోచ‌న చేస్తుంది. మూడు రాజ‌ధానుల అంశం ప్ర‌స్తావించ‌కుండానే ప్ర‌జ‌ల‌కు పాల‌న వికేంద్రీక‌ర‌ణ గురించి వివ‌రించాల‌ని భావిస్తున్న‌ట్లు సమాచారం.ఈ స‌మావేశాల్లో మొత్తం 25 అంశాలపై చర్చించాలని అధికార పక్షం ప్రతిపాదనలు సిద్ధం చేసింది. ఇటు టీడీపీ కూడా త‌న వ్యూహాల‌ను ర‌చిస్తుంది. స‌భకు చంద్ర‌బాబు త‌ప్ప మిగిలిన ఎమ్మెల్యేలు హాజ‌రుకావాల‌ని టీడీఎల్పీలో నిర్ణ‌యం తీసుకున్నారు. నిన్న శాస‌న‌స‌భాప‌క్ష నేత చంద్ర‌బాబు అధ్య‌క్ష‌త‌న టీడీఎల్పీ స‌మావేశం జ‌రిగింది. ఈ స‌మావేశంలో ప‌లు విష‌యాల‌ను చర్చించారు.