Site icon HashtagU Telugu

Virat Kohli Birthday: భర్తకు అనుష్క క్రేజీగా పుట్టినరోజు విశేష్

Virat Kohli Birthday

Virat Kohli Birthday

Virat Kohli Birthday: టీమిండియా రన్ మెషిన్ విరాట్ కోహ్లీ పుట్టినరోజు సందర్భంగా సతీమణి అనుష్క శర్మ బర్తడే విశేష్ తెలియజేసింది. అనుష్క శర్మ భర్తకు ఫన్నీగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపింది. ఇది కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అనుష్క శర్మ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో విరాట్ కోహ్లీ జీరో బాల్‌తో ఔట్ చేసిన వార్త పేపర్ ని స్క్రీన్‌షాట్‌ షేర్ చేసింది. ఈ కథనంలో కెవిన్ పీటర్సన్‌ను జీరో బాల్‌లో అవుట్ చేసిన విరాట్ కోహ్లీ గురించి ప్రస్తావించారు. 2011లో జరిగిన టీ20 మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ పీటర్సన్ ని జీరో బాల్ కే అవుట్ చేశాడు. ఈ పోస్ట్‌తో అనుష్క శర్మ క్యాప్షన్ కూడా రాసింది. తన భర్తకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ అతను తన జీవితంలోని ప్రతి పాత్రలో నిజంగా అసాధారణమైనవాడు. ఏది ఏమైనప్పటికీ, నేను నిన్ను చాలా ప్రేమిస్తున్నాను అంటూ పోస్ట్ పెట్టింది. అనుష్క శర్మ పోస్ట్‌కి విరాట్ కోహ్లీ ఫన్నీ రిప్లై ఇచ్చాడు. విరాట్ హార్ట్ మోజీతో పాటు నుదిటిపై చేయి ఎమోజీని పోస్ట్ చేశాడు. ఇక తన భర్త విరాట్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన అనుష్క తీరును జనాలు ఇష్టపడుతున్నారు.ఫ్యాన్స్ ఫన్నీగా కామెంట్లు పెడుతున్నారు.

Also Read: Lotus Cars: భారత మార్కెట్లోకి ప్రముఖ స్పోర్ట్స్ కార్ల తయారీ సంస్థ..!