Site icon HashtagU Telugu

Anushka Sharma: తల్లి అయినా తగ్గేదేలే.. అనుష్క గ్లామర్ డోస్!

Anushka

Anushka

గత సంవత్సరం పండంటి బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత బాలీవుడ్ నటి అనుష్క శర్మ మీడియాకు దూరంగా ఉంటోంది. తన కూతురు వామిక, భర్త విరాట్ కోహ్లి బాధ్యతలను చూసుకుంటూ ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీ తో బిజీబిజీగా ఉంది. అలాంటి అనుష్క శర్మ బ్లాక్ కటౌట్ డ్రెస్‌లో మెరిసింది అభిమానులను కనువిందు చేసింది. తన ఇన్ స్టాలో ఫొటోలను షేర్ చేయడంతో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఓ బిడ్డకు తల్లయినా తన అందాలతో ఆకర్షిస్తోందని నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు.

బిడ్డ పుట్టిన తర్వాత త‌న‌ ఫిట్‌నెస్ కోల్పోయానని తెలిపింది. పైగా 18 నెలలు శిక్షణ తీసుకునే స్థితిలో త‌న శరీరం లేదని ఆవేద‌న చెందింది. జిమ్‌లో వ్యాయామాలు చేయడంలో నిజంగా ఒత్తిడి ఎదుర్కొన్నాన‌ని వెల్ల‌డించింది. కానీ త‌న మనసు మాత్రం ఈ సినిమా చేయాలని.. ఇందులో కచ్చితంగా భాగం కావాలని చెప్పిందని వెల్లడించింది. అనుష్క రీ ఎంట్రీ సినిమా కోసం ఆమె అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు.

 

Exit mobile version