Site icon HashtagU Telugu

OTT Anti-Tobacco Warning: ఇకపై OTTలో ఆ యాడ్స్ తప్పనిసరి

OTT

New Web Story Copy 2023 05 25t202150.779

OTT Anti-Tobacco Warning: OTT ప్లాట్‌ఫారమ్‌లకు కేంద్రం ఓ షరతు విధించింది. ఇకపై ఓటీటీలో లో పొగాకు వ్యతిరేక యాడ్స్ ని ప్రదర్శించాల్సి అంటూ ఉత్తర్వులు జారీ చేసింది. ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లలో ప్రసారమయ్యే వెబ్ సిరీస్‌లు మరియు చలనచిత్రాలు పొగాకు ఉత్పత్తుల వినియోగాన్ని మరియు ధూమపానాన్ని ఎటువంటి హెచ్చరికలు లేకుండా విస్తృతంగా చూపిస్తున్నాయి. ఇది సిగరెట్లు మరియు ఇతర పొగాకు ఉత్పత్తుల చట్టం 2003ని ఉల్లంఘించడమే అని కేంద్రం భావిస్తుంది.

ఓటిటి ప్లాట్‌ఫారమ్‌లు త్వరలో థియేట్రికల్ ఫిల్మ్‌లు మరియు టెలివిజన్ ప్రోగ్రామ్‌ల తరహాలో పొగాకు వ్యతిరేక హెచ్చరికలు ప్రదర్శించడం తప్పనిసరి అంటూ ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ మేరకు గురువారం అధికారిక వర్గాలు వెల్లడించాయి. సిగరెట్లు మరియు ఇతర పొగాకు ఉత్పత్తుల (ప్రకటనల నిషేధం మరియు వాణిజ్యం, ఉత్పత్తి, సరఫరా మరియు పంపిణీ) రూల్స్ 2004కి సవరణలను మంత్రిత్వ శాఖ పరిశీలిస్తోంది. దీనికి సంబంధించి త్వరలో ఉత్తర్వులు విడుదల చేయనుంది. .

ఆన్‌లైన్ కంటెంట్‌ పబ్లిషర్లు ప్రోగ్రామ్ ప్రారంభంలో మరియు మధ్యలో కనీసం 30 సెకన్ల పాటు పొగాకు వ్యతిరేక హెచ్చరికలను ప్రదర్శించాల్సి ఉంటుందని అధికారిక వర్గాలు తెలిపాయి. పొగాకు యొక్క దుష్ప్రభావాలపై కనీసం 20 సెకన్ల ఆడియో-విజువల్ డిస్‌క్లైమర్‌ను ప్రోగ్రామ్ ప్రారంభంలో మరియు మధ్యలో చూపించాలని తెలిపింది. మన దేశంలోని పిల్లలు మరియు యువతలో పొగాకు వినియోగాన్ని ప్రోత్సహించడంలో OTT ప్లాట్‌ఫారమ్‌లు ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి అని ఒక సంబంధిత అధికారి ఒకరు తెలిపారు.

Read More: Expensive Water Bottle: అత్యంత ఖరీదైన వాటర్ బాటిల్ ఇదే.. ధర ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!