సూర్యాపేట జిల్లా హుజుర్ నగర్ (Huzur Nagar) లో జరిగిన అమానుష ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 26 ఏళ్ల యువతిని నమ్మించి ఇంటికి పిలిపించిన ఆమె స్నేహితురాలు రోజా..ఆమెకు మద్యం తాగించి ఆమె మత్తులోకి వెళ్ళగానే రోజా ప్రియుడు ప్రమోద్, ఆ యువతిపై అత్యాచారం (Rape) చేశాడు. అంతేకాదు ఈ నేరానికి సహకరిస్తూ రోజా మొత్తం ఘటనను వీడియో తీసింది. ఆతర్వాత ప్రమోద్ మరోసారి బాధిత యువతిని బెదిరించాడు. బుధవారం బాధితురాలికి ఫోన్ చేసి హరీశ్ అనే తన స్నేహితుడి కోరిక తీర్చాలని డిమాండ్ చేశాడు. అయితే యువతి తిరస్కరించి.ఎక్కడ మరోసారి తనపై దాడి చేస్తాడో అని భయపడి జరిగిన ఘటనను పోలీసులకు తెలిపింది. ఆమె ఫిర్యాదు మేరకు ప్రమోద్, రోజా, హరీశ్‌లపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
Virat Kohli: ఈడెన్ గార్డెన్స్‌లో విరాట్ కోహ్లీ రికార్డు ఎలా ఉంది?
ఈ అమానుష ఘటన స్థానికంగా తీవ్ర సంచలనం రేపింది. నిందితులు తన స్నేహితులే కావడంతో యువతి తీవ్ర మానసిక ఆందోళనకు గురయ్యిందని, ఈ ఘటనపై కఠినమైన శిక్షలు విధించాలని మహిళా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. బాధిత యువతికి తగిన న్యాయం కల్పించేందుకు పోలీసులు మరింత లోతుగా విచారణ చేపట్టారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా కఠిన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.