AP Volunteer : మరో వాలంటీర్ ఘరానా మోసం బట్టబయలు..

వలంటీర్‌ కమ్‌ డ్వాక్రా గ్రూపు లీడర్‌ అయిన చాట్ల దివ్య తెలుసుకొని.. తన భర్త కిశోర్‌ను నాగేంద్రం బీమా ఖాతాకు నామినీగా

  • Written By:
  • Publish Date - August 30, 2023 / 02:13 PM IST

ఏపీలో వాలంటీర్ల (AP Volunteer ) దారుణాలు ఆగడం లేదు..ఓ పక్క ప్రతిపక్ష పార్టీలు వాలంటీర్ల మోసాలు రోజు రోజుకు ఎక్కువై పోతున్నాయి. వ్యక్తి గత చోరీలకు పాల్పడుతున్నారని, హత్యలు చేస్తున్నారని, ఒంటరి మహిళలను టార్గెట్ చేస్తున్నారని , దోపిడీలకు పాల్పడుతున్నారని గగ్గోలు పెడుతున్నప్పటికీ..రాష్ట్రంలో వాలంటీర్లు మాత్రం వారి ఆగడాలను ఆపడం లేదు. ప్రతి రోజు ఏదోక వివాదంతో వార్తల్లో నిలుస్తున్నారు. ఇప్పటికే చాల దారుణాలు బయట పడగ..తాజాగా ప్రకాశం (Prakasam District) జిల్లా నాగులుప్పలపాడు మండలంలోని కనపర్తిలో మరో దారుణానికి పాల్పడింది ఓవాలంటీర్ మహిళ.

వివరాల్లోకి వెళ్తే..

కనపర్తి గ్రామానికి చెందిన చాట్ల నాగేంద్రం (Chatla Naagendram) అనే మహిళ.. డ్వాక్రా గ్రూపు సభ్యురాలు. భర్త కు దూరంగా అదే గ్రామంలో తల్లిదండ్రుల వద్ద ఉంటూ జీవనం సాగిస్తుంది. కాగా కొంతకాలంగా ఆమె అనారోగ్యంతో బాధపడుతుంది. కాగా ఈమె బీమా సర్వేలో కొంత ఏమౌట్ దాచుకుంది. ఈ విషయాన్ని వలంటీర్‌ కమ్‌ డ్వాక్రా గ్రూపు లీడర్‌ అయిన చాట్ల దివ్య తెలుసుకొని.. తన భర్త కిశోర్‌ను నాగేంద్రం బీమా ఖాతాకు నామినీగా చేర్చాలని అనుకుంది. ఈమేరకు సచివాలయ ఉద్యోగి సహాయంతో తన భర్తను నామినీగా పేరు మార్చేశారు. ఆరోగ్యం బాగా లేని నాగేంద్రం కొంతకాలానికి మృతిచెందారు.

తహసీల్దార్‌ కార్యాలయం నుంచి ఆమె డెత్‌ సర్టిఫికెట్‌ను వలంటీర్‌ దివ్య తీసుకుని మండల వెలుగు కార్యాలయానికి అదించింది. దీంతో వెంటనే బీమా సొమ్ము రూ.లక్ష కిశోర్‌ ఖాతాలో జమయ్యాయి. ఈ విషయం తెలుసుకున్న నాగేంద్రం సోదరుడు చాట్ల పుల్లయ్య.. వలంటీర్‌ చేసిన మోసంపై ఎంపీడీఓ జయమణికి ఫిర్యాదు చేశారు. బీమా సొమ్మును తన తల్లి చాట్ల సమాధానంకు ఇప్పించాలని కోరారు. అలాగే దివ్యతో పాటు, డిజిటల్‌ అసిస్టెంట్‌పైనా క్రిమినల్‌ కేసులు పెట్టి, వారిని ఉద్యోగం నుంచి తొలగించాలని డిమాండ్‌ చేశారు.

Read Also : AP: రాఖీ పర్వదినాన..ఆడవారికి రక్షణ లేదంటూ ఆవేదన వ్యక్తం చేసిన పవన్ కళ్యాణ్