Site icon HashtagU Telugu

Basara: బాసరలో మరో విషాదం.. ట్రిపుల్ ఐటీలో విద్యార్థిని ఆత్మహత్య

Crime

నిర్మల్ జిల్లా బాసర ఆర్జీయూకేటీ ట్రిపుల్ ఐటీలో గురువారం రాత్రి శిరీష (17) అనే విద్యార్థిని హాస్టల్ గదిలో ఉరి వేసుకొని ఆత్మహ త్యకు పాల్పడింది. సంగారెడ్డి జిల్లా మానూరు మండలం దావూరు గ్రామానికి చెందిన శిరీష ఈ విద్యా సంవత్సరమే ట్రిపుల్ ఐటీలో ప్రవేశం పొంది పీయూసీ (ప్రీ యూనివర్సిటీ కోర్సు) మొదటి సంవత్సరం చదువుతోంది. గురువారం రాత్రి భోజనానికి వెళ్లి వచ్చిన విద్యార్థులు హాస్టల్ గదిలో ఆమె ఆత్మహత్య చేసుకుని ఉండడం గమనించి షాక్కు గురయ్యారు.

శిరీష వ్యక్తిగత కారణాలతో ఆత్మహత్యకు పాల్పడిందా? లేక ఒత్తిడితోనా? లేని పక్షంలో మరే ఇతర కారణాలు ఉన్నాయా? అన్న విషయం తెలియాల్సి ఉంది. పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని విచారణ జరుపుతున్నారు. కాగా, తన బావ ఇటీవల ఆత్మహత్య చేసుకోవడంతో ఆ విషాదాన్ని తట్టుకోలేక తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్లు శిరీష ఘటనాస్థలంలో ఉంచిన సూసైడ్ నోట్లో పేర్కొంది. ఈ విద్యా సంవత్సరం ప్రారంభమైన నాటి నుంచి ట్రిపుల్ ఐటీ క్యాంపస్ లో ఇది ఐదో ఆత్మహత్య ఘటన.

Exit mobile version