హైదరాబాద్ మెట్రో స్టేషన్‌లో మరో ఆత్మహత్య (Suicide) ఘటన కలకలం రేపింది. మూసాపేట్ మెట్రో స్టేషన్‌లో గుర్తు తెలియని వ్యక్తి సూసైడ్ చేసుకున్నాడు. రైలుకు ఎదురెళ్లి ప్రాణాలు కోల్పోయాడు. దీంతో మృతుడి వివరాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. టికెట్ లేకుండానే అతడు లోపలికి వెళ్లినట్టు తెలుస్తోంది. గురువారం రాత్రి తొమ్మిదిన్నర గంటల సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. టికెట్ తీసుకోకుండానే ఆ వ్యక్తి స్టేషన్‌లోకి ప్రవేశించినట్లు సిబ్బంది చెబుతున్నారు. నేరుగా ప్లాట్‌ఫామ్‌కు చేరుకుని సరిగ్గా రైలు వచ్చేది గమనించి దానికి ఎదురుగా దూకేయడంతో ఇంజిన్‌కు ప్లాట్‌ఫామ్‌కు మధ్యలో బాడీ పడిపోయింది.
Also Read: Art Director Passes Away: సినీ పరిశ్రమలో మరో తీవ్ర విషాదం.. ప్రముఖ ఆర్ట్ డైరెక్టర్ మృతి
కాగా.. రెండు రోజుల క్రితమే ఓ మహిళ ఎర్రగడ్డ మెట్రోస్టేషన్ పైనుంచి దూకి చనిపోయిన సంగతి తెలిసిందే. గతంలో కూడా ఓ యువతి మెట్రో పైనుండి దూకి ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. చిన్న చిన్న కారణాలకే ఆత్మహత్యలు చోటు చేసుకుంటున్నారు. మెట్రో స్టేషన్ వద్ద ప్రతి రోజూ వందలాది మంది రద్దీ వున్న ప్రదేశంలోనే ఇలాంటి ఘటనలు చోటుచేసుకోవడంతో నగరవాసులు భయభ్రాంతులకు లోనవుతున్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని అధికారులను ప్రయాణికులు కోరుతున్నారు.