TBJP: బీఆర్ఎస్ కు మరో షాక్.. బీజేపీలోకి మరో ఎంపీ

TBJP: జహీరాబాద్ బీఆర్ఎస్ ఎంపీ బీబీ పాటిల్ బీజేపీ తీర్థం పుచ్చుకోనున్నారు. ఈ సాయంత్రం పార్టీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డాసమక్షంలో పార్టీ కండువా కప్పుకోనున్నారు. ఇప్పటికే ఢిల్లీ చేరుకున్న పాటిల్.. ఆ పార్టీ పెద్దల సమక్షంలో బీజేపీలో చేరనున్నారు. వచ్చే ఎన్నికల్లో ఆయనకు జహీరాబాద్ టికెట్ ఇచ్చేందుకు బీజేపీ హైకమాండ్ అంగీకరించినట్లు తెలుస్తోందిఇప్పటికే ఆయన బీఆర్ఎస్ పార్టీకి బీబీ పాటిల్ రాజీనామా చేశారు. బీఆర్ఎస్ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ఆ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్‌కు లేఖను […]

Published By: HashtagU Telugu Desk
BJP First List

Bjp Releases List Of Candid

TBJP: జహీరాబాద్ బీఆర్ఎస్ ఎంపీ బీబీ పాటిల్ బీజేపీ తీర్థం పుచ్చుకోనున్నారు. ఈ సాయంత్రం పార్టీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డాసమక్షంలో పార్టీ కండువా కప్పుకోనున్నారు. ఇప్పటికే ఢిల్లీ చేరుకున్న పాటిల్.. ఆ పార్టీ పెద్దల సమక్షంలో బీజేపీలో చేరనున్నారు. వచ్చే ఎన్నికల్లో ఆయనకు జహీరాబాద్ టికెట్ ఇచ్చేందుకు బీజేపీ హైకమాండ్ అంగీకరించినట్లు తెలుస్తోందిఇప్పటికే ఆయన బీఆర్ఎస్ పార్టీకి బీబీ పాటిల్ రాజీనామా చేశారు. బీఆర్ఎస్ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ఆ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్‌కు లేఖను పంపించారు.

జహీరాబాద్ ప్రజలకు సేవ చేసే అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలని తన లేఖలో పేర్కొన్నారు బీబీ పాటిల్.2014లో టీఆర్ఎస్ పార్టీలో చేరిన బీబీ పాటిల్.. అదే ఏడాదిలో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో జహీరాబాద్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి.. కాంగ్రెస్ పార్టీకి చెందిన సురేష్ కుమార్ షెట్కార్‌పై గెలిచారు. 2019న మరోసారి లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసి.. సమీప కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మదన్ మోహన్ రావుపై 6166 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు.

  Last Updated: 02 Mar 2024, 12:59 AM IST