Site icon HashtagU Telugu

YCP : హైకోర్టులో వైసీపీకి మరో ఎదురుదెబ్బ

Ycp Leaders Thieft

Ycp Leaders Thieft

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. పులివెందుల, ఒంటిమిట్ట ZPTC స్థానాల ఉప ఎన్నికల ఫలితాలు వైసీపీ (YCP) కి షాక్ ఇస్తే..హైకోర్టులో మరో ఎదురుదెబ్బ తగిలింది. ఈ రెండు స్థానాల్లో రీపోలింగ్ నిర్వహించాలంటూ వైఎస్సార్సీపీ దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది. ఎన్నికల ప్రక్రియలో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ, వైఎస్సార్సీపీ ఈ పిటిషన్ దాఖలు చేసింది.

Assembly Meetings : సెప్టెంబర్ 17 లేదా 18 నుంచి అసెంబ్లీ సమావేశాలు – అయ్యన్న

వివరాల్లోకి వెళ్తే.. పులివెందుల పరిధిలోని 15 పోలింగ్ కేంద్రాల్లో, ఒంటిమిట్ట పరిధిలోని 30 పోలింగ్ కేంద్రాల్లో రీపోలింగ్ నిర్వహించాలని కోరుతూ వైఎస్సార్సీపీ లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది. ఎన్నికల ప్రక్రియలో జరిగిన అక్రమాలను వీడియో సాక్ష్యాలతో సహా కోర్టు ముందు ఉంచింది. అయితే, ఈ పిటిషన్‌ను విచారించిన న్యాయస్థానం, వైఎస్సార్సీపీ అభ్యర్థనను తిరస్కరించింది. కోర్టు ఈ కేసులో రీపోలింగ్ అవసరం లేదని స్పష్టం చేసింది.

హైకోర్టు తీర్పు వైఎస్సార్సీపీకి నిరాశ కలిగించింది. ఈ తీర్పు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఎన్నికల కమిషన్, న్యాయస్థానాలు తీసుకున్న నిర్ణయాలపై వైఎస్సార్సీపీ నాయకులు ఎలా స్పందిస్తారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.