Karnataka: ప్రధాని మోదీ పర్యటనలో మరోసారి భద్రతా లోపం..మోదీ వైపు పరుగులు తీసిన ఓ వ్యక్తి

కర్నాటకలో మరోసారి ప్రధానమంత్రి నరేంద్రమోదీ పర్యటనలో మరోసారి భద్రతా లోపం బయటపడింది. ప్రధాని ర్యాలీ సందర్భంగా భద్రత ఉల్లంఘన జరిగింది.

Published By: HashtagU Telugu Desk
Karnataka

Karnataka

కర్నాటకలో (Karnataka) మరోసారి ప్రధానమంత్రి నరేంద్రమోదీ (pm modi)పర్యటనలో మరోసారి భద్రతా లోపం బయటపడింది. ప్రధాని ర్యాలీ సందర్భంగా భద్రత ఉల్లంఘన జరిగింది. మూడు నెలల వ్యవధిలోనే ఇది రెండోసారి. ప్రధాని వద్దకు వెళ్లేందుకు ప్రయత్నించిన ఓ వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన దావణగెరెలో జరిగింది. రోడ్ షోలో వెళ్తున్న ప్రధానమంత్రి మోదీని చూసేందుకు రోడ్డుకు ఇరువైపులా జనం గుమిగూడారు. ఇంతలో ఓ వ్యక్తి తోసుకుంటూ వచ్చి ప్రధాని దగ్గరకు వెళ్లేందుకు ప్రయత్నించాడు. దాదాపు ప్రధాని కారు దగ్గరకు చేరుకోగానే…భద్రతా బలగాలు అతన్ని అడ్డుకున్నాయి.

అంతకుముందు జనవరిలో కర్నాటకలో హుబ్లీలో ప్రధానిమోదీ రోడ్ షో జరిగినప్పుడు కూడా ఓ చిన్నారి ప్రధానికి దగ్గరగా వచ్చాడు. ఆరో తరగతి చదువుతున్న చిన్నారి ప్రధాని మోదీకి పూలమాల వేసేందుకు ప్రయత్నించాడు. వెంటనే తేరుకున్న ఎస్పీజీ జవాన్లు పిల్లాడిని అడ్డుకున్నారు. ఈ ఘటన ప్రధానమంత్రి భద్రతలోపాన్ని చూపాయి. అయితే కర్నాటక పోలీసులు దీనిని భద్రతాలోపంగా పేర్కొనలేదు.

  Last Updated: 25 Mar 2023, 08:26 PM IST