Site icon HashtagU Telugu

New Scheme : ‘జ‌గ‌న‌న్న పాల‌వెల్లువ’ ప‌థ‌కం ప్రారంభం

cm jagan

రెండేళ్ల పాలన పూర్తి చేసుకున్న జగన్ ప్రభుత్వం పలు సంక్షేమ పథకాలను ప్రవేశపెడుతూ ముందుకెళ్తోంది. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న జ‌గ‌న‌న్న పాల‌వెల్లువ ప‌థ‌కాన్ని ముఖ్యమంత్రి వైఎస్‌ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఈ రోజు ప్రారంభించారు. తాడేప‌ల్లిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాల‌యంలో నిర్వహించ‌నున్న కార్యక్రమంలో వ‌ర్చువ‌ల్‌గా ఈ ప‌థ‌కాన్ని ఆయ‌న ప్రారంభించారు. జ‌గ‌న‌న్న పాల‌వెల్లువ ప‌థ‌కం తొలిద‌శ కోసం కృష్ణా జిల్లానుఎంపిక చేసుకున్నారు. జిల్లాలోని నూజివీడు నియోజ‌క‌వ‌ర్గంలోని 9 మండ‌లాల్లో ఉన్న 100 గ్రామాల నుంచి పాల‌ను సేక‌రించనున్నారు.