Site icon HashtagU Telugu

Gujarat Assembly Polls : గుజ‌రాత్ అసెంబ్లీ ఎన్నిక‌ల ముందు కాంగ్రెస్‌కి భారీ షాక్‌.. రాజీనామా చేసిన ఎమ్మెల్యే..!

Congress

Congress

గుజరాత్‌లో అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్‌కు మరో షాక్ త‌గిలింది. ఎమ్మెల్యే ఝలోద్ భవేష్ కటారా బుధవారం స్పీకర్ నిమాబెన్ ఆచార్యకు తన రాజీనామాను సమర్పించారు.ఇప్ప‌టికే గుజరాత్‌లోని తలాలా నియోజకవర్గం నుండి కాంగ్రెస్ ఎమ్మెల్యే భగవాన్‌భాయ్ డి బరాద్ తన రాజీనామాను డాక్టర్ నిమాబెన్ ఆచార్యకు సమర్పించారు. ఇప్పుడు తాజాగా మ‌రో ఎమ్మెల్యే రాజీనామా చేయ‌డంతో కాంగ్రెస్‌లో ఆందోళ‌న నెల‌కొంది. తన మద్దతుదారులతో సంప్రదింపులు జరిపిన తర్వాతే తాను కాంగ్రెస్‌ను వీడాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు. త్వ‌ర‌లో ఆయ‌న ఆయన బీజేపీలో చేరనున్నారు.