Site icon HashtagU Telugu

Heart Stroke: మరో హార్ట్ స్ట్రోక్.. బ్యాడ్మింటన్ ఆడుతూ కుప్పకూలిన వ్యక్తి

Heart Attack

Heart Attack

కరోనా తర్వాత చాలామంది గుండె సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారా? యువతకు హార్ట్ స్ట్రోక్ బారిన పడుతున్నారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఇటీవల నందమూరి తారకరత్న గుండె సంబంధిత సమస్యతో చనిపోయిన విషయం తెలిసిందే. ఆయన మరణవార్త వినకముందే ఓ వ్యక్తి మరణించాడు. హైదరాబాద్‌లో 38 ఏళ్ల వ్యక్తి బ్యాడ్మింటన్ ఆడుతూ మరణించాడు. ఇండోర్ స్టేడియంలో ఆడుతుండగా శ్యామ్ యాదవ్ కుప్పకూలిపోయాడు. అతని మరణానికి ఖచ్చితమైన కారణం ఇంకా తెలియలేదు.