Site icon HashtagU Telugu

Janasena : జనసేనకు మరో గుడ్ న్యూస్

జనసేన (Janasena) పార్టీకి మరో శుభవార్త అందింది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్‌(AP)లో ప్రాంతీయ పార్టీగా గుర్తింపు పొందిన జనసేనకు ఇప్పుడు తెలంగాణ(Telangana)లో కూడా అధికారిక గుర్తింపు లభించింది. రాష్ట్ర ఎన్నికల సంఘం (SEC) తాజాగా విడుదల చేసిన ఉత్తర్వుల ప్రకారం, జనసేన పార్టీకి తెలంగాణలోనూ గుర్తింపు లభించడంతో పార్టీ శ్రేణుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్‌లో తన స్థానం పటిష్ఠం చేసుకున్న జనసేన, 2024 ఎన్నికల్లో 21 ఎమ్మెల్యేలు, 2 ఎంపీలను గెలిపించుకొని బలమైన పార్టీగా ఎదిగింది. ఈ విజయంతో జనసేన రిజిస్టర్డ్ పార్టీ హోదా నుంచి, అధికారికంగా గుర్తింపు పొందిన పార్టీగా మారింది. దీంతో పార్టీకి మరింత బలం పెరిగింది. ఇకపై జనసేన పార్టీ ఎన్నికల్లో గాజు గ్లాసు గుర్తుతోనే పోటీ చేయనుంది. ఈ గుర్తును జనసేన అధికారికంగా పొందడంతో ఇకపై మరెవరికి కేటాయించరు. ఇది తెలంగాణలో కూడా జనసేన తనకంటూ ప్రత్యేక స్థానం ఏర్పరచుకునే అవకాశం కల్పిస్తోంది.

Sake Sailajanath: వైసీపీలోకి శైలజానాథ్‌.. కండువా కప్పి ఆహ్వానించిన వైఎస్‌ జగన్‌

జనసేన పార్టీ తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయాలని నిర్ణయించుకుంది. ఏ పార్టీతోనూ పొత్తులు ఉండవని ఇప్పటికే ప్రకటించారు. అయితే జనసేన ప్రస్తుతం ఎన్డీఏ కూటమిలో ఉంది. అయితే ప్రధానంగా ఏపీ వరకూ వారి పొత్తులు ఉన్నాయి. తెలంగాణలో ఎవరితోనూ పొత్తులు ఉండవని కిషన్ రెడ్డి ఇప్పటికే ప్రకటించారు. స్థానిక ఎన్నికల్లో జనసేన పార్టీ క్యాడర్ కు అవకాశాలు కల్పించాలని పవన్ కల్యాణ్ కూడా అనుకుంటున్నారు. ఇక తెలంగాణలో అధికారిక గుర్తింపు లభించడం జనసేన వ్యాప్తికి మరింత సహాయపడనుంది. ముఖ్యంగా, రాష్ట్ర రాజకీయాల్లో పార్టీ ప్రభావం పెరగనుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. గతంలో జనసేన నేతలు తెలంగాణలో పార్టీ బలోపేతంపై దృష్టి సారిస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ పరిణామంతో జనసేన శ్రేణులు ఆనందం వ్యక్తం చేస్తున్నాయి.