Site icon HashtagU Telugu

HYD: హైదరాబాద్ లో మరో అగ్ని ప్రమాదం, భయాందోళనలో స్థానికులు

Fire Accident

Fire Accident

HYD: హైదరాబాద్‌లో తరచూ అగ్నిప్రమాదాలు చోటుచేసుకోవడం ఆందోళన కలిగిస్తోంది. ఇటీవల జరిగిన ఓ ప్రమాదంలో ఆసుపత్రి మొత్తం బూడిద కుప్పలా మారింది. అత్తాపూర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని సులైమాన్‌నగర్‌ ఎంఎం పహాడీలోని కట్టెల గోడౌన్‌లో బుధవారం ఉదయం భారీ అగ్నిప్రమాదం జరిగింది. పక్కనే ఉన్న స్క్రాప్ షాపుకు మంటలు వ్యాపించడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. మంటలు చెలరేగడంతో దట్టమైన పొగలు రావడంతో ఊపిరి పీల్చుకోవడానికి ఇబ్బంది పడ్డారు.

ప్రమాదంపై సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. మరోవైపు పోలీసులు స్థానికులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఈ ప్రమాదంలో భారీగా ఆస్తినష్టం జరిగినట్లు అంచనా వేస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

కాగా ఇటీవలనే హైదరాబాద్ సిటీలోని గుడి మల్కాపూర్ లో ఉన్న అంకురా ఆస్పత్రిలో భారీ అగ్ని ప్రమాదం. 2023, డిసెంబర్ 23వ తేదీ సాయంత్రం 5 గంటల సమయంలో.. ఐదు అంతస్తుల ఆస్పత్రి భవనంలోని.. టెర్రస్ పై మంటలు ప్రారంభం అయ్యాయి. టపాసులు పేలినట్లు టెర్రస్ పై మంటలు ఎగిసిపడ్డాయి. అదుపు చేసేందుకు ఆలస్యం కావటంతో.. ఆస్పత్రి మొత్తం మంటల్లో చిక్కుకుంది. ఐదు అంతస్తుల్లోని బిల్డింగ్ మొత్తానికి మంటలు వ్యాపిస్తుండటంతో.. రోగులు అందరినీ బయటకు తరలించారు.

Exit mobile version