Site icon HashtagU Telugu

Electric Car: మార్కెట్‌లోకి మరో ఎలక్ట్రిక్ కారు.. తక్కువ ధరలోనే అదిరిపోయే ఫీచర్లు

Whatsapp Image 2023 05 05 At 22.03.55

Whatsapp Image 2023 05 05 At 22.03.55

Electric Car: ఇటీవల ఎలక్ట్రిక్ వెహికల్స్ వినియోగం బాగా పెరిగిపోయింది. మార్కెట్ లోకి కూడా ఎలక్ట్రిక్ వెహికల్స్ వస్తున్నాయి. తక్కువ ధరలోనే ఇవి లభిస్తుండటంతో చాలామంది వినియోగదారులు వీటిని కొనేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. పెట్రోల్, డీజిల్ ధరలు ఆకాశాన్ని అంటున్నాయి. దీంతో వెహికల్స్ నిర్వహణ వాహనదారులకు భారంగా మారుతోంది. దీంతో పెట్రోల్, డీజిల్ భారం నుంచి తప్పించుకునేందుకు ఇప్పుడు ఎక్కువమంది ఎలక్ట్రిక్ వెహికల్స్ వైపు మొగ్గు చూపుతున్నారు. వీటి వల్ల పర్యావరణ కాలుష్యం కూడా ఎక్కువగా ఉండదు.

పర్యావరణానికి కూడా నష్టం తగ్గుతుండటంతో ఎలక్ట్రిక్ వెహికల్స్ వినియోగదాన్ని కేంద్ర ప్రభుత్వం కూడా ప్రోత్సహిస్తుంది. ఎలక్ట్రిక్ వెహికల్స్ ఛార్జింగ్ పాయింట్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. హైవేలపై వీటిని అందుబాటులోకి తెస్తుంది. ఇప్పుడు అనేక కంపెనీలు ఎలక్ట్రిక్ కార్లు, బైక్ లు తీసుకొస్తుండగా.. తాజాగా ఎంజి మోటార్ ఇండియా తన కామెట్ ఎలక్ట్రిక్ కారును తీసుకొచ్చింది. వేరియంట్స్, వాటి ధరలను తాజాగా అధికారికంగా ప్రకటించింది.

మొత్తం మూడు వేరియంట్లలో ఇది లభిస్తుంది. పేస్, ప్లే, ప్లస్ అనే వేరియంట్లలో విడుదల చేసింది. పేస్ వేరియంట్ ధర రూ.7.98 లక్షలుగా ఉండగా.. ప్లే వేరియంట్ ధర రూ.9.28 లక్షలు, ప్లస్ వేరియంట్ ధర రూ.9.98 లక్షలుగా ఉంది. మే 15 నుంచి బుకింగ్స్ ప్రారంభం కానుండగా.. చివరి వారం నుంచి డెలివరీలు స్టార్ట్ అవుతాయి. మొదట బుక్ చేసుకున్న 5 వేల మందికి మాత్రమే ప్రారంభ ధరలు వర్తించనున్నాయి.

ఈ కారు చూటానికి చాలా చిన్నదిగా ఉన్నప్పటికీ చాలా అడ్వాన్స్ డే ఫీచర్లు ఉన్నాయి. 10.25 ఇంచెస్ టచ్ స్క్రీన్ తో పాటు వైట్ అండ్ గ్రే కలర్ ఇంటీరియల్ ఉంటుంది. ఇన్పోటైూన్మెంట్ సిస్టమ్, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్రస్టర్ ఉంటాయి. ఆండ్రాయిట్ ఆటో, స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్ వంటి ఎన్నో ఫీచర్లు ఉన్నాయి.