KTR Interesting Tweet: మరో స్వప్నం సాకారమైన క్షణమిది.. కేటీఆర్ ఆస‌క్తిక‌ర ట్వీట్‌

  • Written By:
  • Updated On - June 27, 2024 / 03:45 PM IST

KTR Interesting Tweet: గత కేసీఆర్ ప్ర‌భుత్వంలో 17 వేల కోట్ల అంచనాతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సీతారామ ప్రాజెక్టు మోటార్ల ట్రయల్ రన్ సక్సెస్ కావ‌డంతో మాజీ మంత్రి కేటీఆర్ (KTR Interesting Tweet) ఎక్స్ వేదిక‌గా ఓ ఆస‌క్తిక‌ర ట్వీట్ చేశారు. ఆ ట్వీట్‌లో ఏం రాశారంటే.. మరో స్వప్నం సాకారమైన క్షణమిది.. కేసిఆర్ గారి మహాసంకల్పం నెరవేరిన రోజిది. “సీతారామ ప్రాజెక్టు నా గుండెకాయ” అని.. ఆనాడే ప్రకటించారు నాటి సీఎం కేసిఆర్ గారు. ఖమ్మం నుంచి కరువును శాశ్వతంగా పారదోలే.. వరప్రదాయినికి ప్రాణం పోశారు కేసిఆర్ గారు. ప్రాజెక్టు పనులను శరవేగంగా పరుగులు పెట్టించారు. ప‌టిష్ట ప్రణాళికను యుద్ధప్రాతిపదికన అమలుచేశారు.

ఉమ్మడి ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాల్లోని 10 లక్షల ఎకరాల్లో పచ్చని పంటలకు బంగారు బాటలు వేశారు. ఖమ్మంలోని ప్రతి ఇంచుకు ఇక ఢోకా లేదు. ద‌శాబ్దాలపాటు దగాపడ్డ రైతుకు ఇక చింత లేదు. కాలమైనా.. కాకపోయినా.. పరవళ్లు తొక్కుతున్న ఈ గోదావరి జలాలతో.. ఖమ్మం రైతుల జీవితాల్లో సరికొత్త వెలుగులు వ‌స్తాయ‌ని ట్వీట్ చేశారు.

Also Read: Nara Lokesh Congratulates Team: క‌ల్కి సినిమాపై మంత్రి నారా లోకేష్ ట్వీట్‌.. ఏమ‌న్నారంటే..?

కేసిఆర్ గారి కలను సాకారం చేసి.. ఈ “జలవిజయం”లో భాగస్వాములైన నీటిపారుదల అధికారులు, సిబ్బందికి అభినందనలు. కష్టపడిన ప్రతిఒక్కరికి హృదయపూర్వక కృతజ్ఞతలు. జై తెలంగాణ, జై సీతారామ ప్రాజెక్టు అని రాసుకొచ్చారు. అయితే ఈ ప్రాజెక్ట్‌తో ఉమ్మడి ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాలోని 10 లక్షల ఎకరాలకు సాగు నీరు అందుతుంద‌ని అధికారులు తెలిపారు. మ‌రోవైపు ఆగస్టు 15 కల్లా ఈ ప్రాజెక్టు పూర్తి చేయాల‌ని మంత్రి తుమ్మ‌ల‌ అధికారుల‌ను ఆదేశించారు.

We’re now on WhatsApp : Click to Join