Site icon HashtagU Telugu

Hyderabad Cricket Association : హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ పై మరో కేసు న‌మోదు

Hca Imresizer (1)

Hca Imresizer (1)

హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్‌(హెచ్‌సీఏ)పై మరో కేసు నమోదయింది. ఆదివారం భారత్‌-ఆస్ట్రేలియా మధ్య ఉప్పల్‌ స్టేడియంలో టీ 20 మ్యాచ్‌ జరిగింది. మ్యాచ్‌కు సంబంధించిన టికెట్లపై తప్పుడు సమయం ముద్రించారని ఓ యువకుడు బేగంపేట పోలీసులకు ఫిర్యాదు చేశాడు. టికెట్లపై సాయంత్రం 7.30 గంటలకు మ్యాచ్‌ ప్రారంభమవుతుందని ముద్రించారని, కానీ ఆట మాత్రం 7 గంటలకే ప్రారంభమైందని అందులో పేర్కొన్నాడు. దీంతో కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. హెచ్‌సీఏపై ఇప్పటికే మూడు కేసులు నమోదైన విషయం తెలిసిందే. మ్యాచ్‌ టికెట్ల విక్రయం సందర్భంగా తీవ్ర గందరగోళం నెలకొన్న విషయం తెలిసిందే. జింఖానా గ్రౌండ్‌లో అభిమానుల మధ్య తొక్కిసలాట జరిగింది. దీనిపై బాధితులు అదితి ఆలియా, ఎస్‌ఐ ప్రమోద్‌ ఫిర్యాదులతో పోలీసులు కేసులు పెట్టారు. టికెట్‌ నిర్వహణ, బ్లాక్‌లో అమ్మారన్న ఆరోపణలపై సెక్షన్‌ 420, సెక్షన్‌ 21, సెక్షన్‌ 22/76 కింద హెచ్‌సీఏ అధ్యక్షుడు, మ్యాచ్‌ నిర్వాహకులపై కేసులు నమోదుచేశారు.