పంజాబ్ లోని గోల్డెన్ టెంపుల్ దగ్గర బాంబ్ బ్లాస్ట్ ఘటనలు కలకలం రేపుతున్నాయి. ఇప్పటివరకు ఒకటి జరగ్గా, తాజాగా మరో పేలుడు జరగడం ఆందోళనకు గురిచేస్తోంది. అమృత్‌సర్‌లోని (Amritsar) గోల్డెన్ టెంపుల్ (Golden Temple) సమీపంలోని హెరిటేజ్ స్ట్రీట్ వద్ద సోమవారం ఉదయం జరిగిన పేలుడులో ఒకరు గాయపడారు. మే 6న పేలుళ్లు జరిగినట్టు సమాచారం. అయితే, పేలుడుకు గల కారణం ఇంకా నిర్ధారించబడలేదు. “ఇక్కడ పరిస్థితి సాధారణంగా ఉంది. విధ్వంస నిరోధక, బాంబ్ స్క్వాడ్, ఎఫ్‌ఎస్‌ఎల్ బృందాలు అలర్ట్ గా ఉన్నాయి.” అని అమృత్‌సర్ అదనపు డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ మెహతాబ్ సింగ్ ANI కి చెప్పారు.
పేలుడు ధాటికి ఒక వ్యక్తి కాలికి స్వల్ప గాయమైందని (Injured), సమీపంలోని కొన్ని భవనాల అద్దాలు దెబ్బతిన్నాయని ఆయన తెలిపారు. సంఘటన సమయంలో డ్యూటీ చేస్తున్న స్వీపర్.. పెద్ద పేలుడు శబ్దం వినిపించిందని, భారీ పొగలు వ్యాపించాయని అని చెప్పాడు. కాగా మే 6, శనివారం రాత్రి 11:15 గంటలకు గోల్డెన్ టెంపుల్ సమీపంలోని అదే హెరిటేజ్ స్ట్రీట్‌లో పేలుడు సంభవించిందని, ఇందులో ఒకరు గాయపడ్డారని పోలీసులు తెలిపారు. శనివారం నాటి పేలుడు, సోమవారం జరిగిన పేలుడు రెండూ తక్కువ తీవ్రతతో ఉన్నాయని మెహతాబ్ సింగ్ తెలిపారు.
Also Read: Rajini Fans Upset: ‘లాల్ సలామ్’ నుంచి రజనీ ఫస్ట్ లుక్, తలైవా ఫాన్స్ డిజాప్పాయింట్!