Tirumala : శేషాచలం అడవుల్లో సంచరిస్తున్న మ‌రో 30 చిరుత పులులు – డీఎఫ్‌వో శ్రీనివాసులు

తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు వెళ్లే భక్తులు పెద్ద సంఖ్యలో నడకదారిలో కొండపైకి వెళ్తారు. దారి పొడవునా పలు

Published By: HashtagU Telugu Desk
Tirumala Alipiri

Tirumala Alipiri

తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు వెళ్లే భక్తులు పెద్ద సంఖ్యలో నడకదారిలో కొండపైకి వెళ్తారు. దారి పొడవునా పలు ఆలయాల్లో పూజలు చేస్తూ గోవింద నామస్మరణ చేస్తూ తిరుమల చేరుకుంటారు. అయితే ప్రస్తుతం భక్తులు నడకదారిలో వెళ్లాలంటే ఒకటికి రెండుసార్లు ఆలోచించే పరిస్థితి నెలకొంది. నడకదారిలో చిరుతలు తిరుగుతున్నాయి. తాజాగా ఓ బాలికను చిరుత చంపి భక్తులను భయాందోళనకు గురి చేసింది. మరోవైపు సోమవారం ఉదయం అలిపిరి నడకలో ఏడో మైలురాయి వద్ద ఓ చిరుత బోనులో చిక్కుకుంది. శేషాచలం అటవీ ప్రాంతంలో 25 నుంచి 30 చిరుతలు ఉన్నట్లు డీఎఫ్‌వో శ్రీనివాసులు తెలిపారు. బాలికను చంపిన చిరుత, పట్టుకున్న చిరుత ఒకటేనా కాదా అనే విషయాన్ని నిర్ధారించేందుకు పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు. వాకింగ్ పాత్‌లో ఎన్ని చిరుతలు సంచరిస్తున్నాయో అధ్యయనం చేస్తామన్నారు. చిరుతపులి సంచారాన్ని గుర్తించేందుకు ప్రతి కిలోమీటరుకు 500 సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తామన్నారు.

  Last Updated: 14 Aug 2023, 01:31 PM IST