Site icon HashtagU Telugu

Khammam : నవజాత శిశువుకు అరుదైన శ‌స్త్ర‌చికిత్స చేసిన అంకురా ఆసుప‌త్రి వైద్యులు

baby

baby

ఖ‌మ్మంలో ఓ నవజాత శిశువుకు అంకురా ఆస్పత్రి వైద్యులు అరుదైన శస్త్రచికిత్స నిర్వహించారు.అంకురా ఆసుపత్రి వైద్యులు రాజేష్ చల్లగుల్లా, వరుణ్, రోహిత్ కిరణ్ ఆద్వ‌ర్యంలో ఈ చికిత్స జ‌రిగింది. హుజూర్‌నగర్‌కు చెందిన దంపతులకు ఓ పాప పుట్టింది. అయితే ఆ పాపకు పెరినియం వాపుతో నొప్పిని వ‌స్తుండ‌టంతో అంక‌రా ఆసుప‌త్రిలో చేరారు. పెరినియమ్‌లో వాపు కారణంగా శిశువు మలద్వారంలో నొప్పితో బాధపడింది. చర్మం రంగు ఎరుపు రంగులోకి మారింది. మాగ్నిఫికేషన్ ఆపరేషన్‌తో పెరినియం వాపును తొలగించేందుకు వైద్యులు అరుదైన శస్త్రచికిత్స నిర్వహించారు. ప్రస్తుతం పాప క్షేమంగా ఉందని, ఆపరేషన్ విజయవంతమైందని డాక్ట‌ర్లు తెలిపారు. ఇది చాలా అరుదైన కేసు అని, తాము ఆపరేషన్ విజయవంతంగా నిర్వహించామని చెప్పారు.