ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి అనిత (Andhra Pradesh Home Minister Anitha)మరోసారి తన మానవత్వాన్ని చాటుకున్నారు. విశాఖపట్నం(Vizag)లోని పాత గాజువాక జంక్షన్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదం(Road Accident)లో గాయపడిన చిన్నారికి సహాయం చేయడం ద్వారా ఆమె అందరి మన్ననలు పొందారు. బైకును ట్రావెల్స్ బస్సు ఢీకొట్టిన ప్రమాదంలో చిన్నారి తీవ్రంగా గాయపడింది. ఆ సమయంలోనే అనిత వెళ్తుండగా…ఈ ఘటనను చూసి వెంటనే తన సిబ్బందిని ఆదేశించి బాధితులను ఆస్పత్రికి తరలించేందుకు చర్యలు చేపట్టారు. చిన్నారిని ఆస్పత్రికి తరలించేందుకు ఆమె చేసిన ప్రయత్నం కారణంగా అత్యవసర వైద్యం అందించగలిగారు. ఈ ఘటన స్థానికులు చూస్తున్న సమయంలో, మంత్రిగారి ఈ సత్వర చర్య వారి హృదయాలను కదిలించింది. ప్రజాప్రతినిధులుగా ఉండే వ్యక్తులు బాధితులకు ఇలా సహాయం చేయడం ఆచరణలో మానవత్వం ఆవిష్కృతం కావడమే అని అంత మాట్లాడుకున్నారు.
Kite and Sweet Festival : రేపు సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో కైట్ ఫెస్టివల్
ఈ సంఘటనపై స్పందించిన స్థానికులు హోంమంత్రి అనితను ప్రశంసిస్తూ, ఆమె మానవత్వానికి అభినందనలు తెలియజేశారు. ఇలాంటి సంఘటనలు ప్రజలకు నాయకులపై నమ్మకాన్ని పెంచుతాయని, వీరి సహాయ చర్యలు స్ఫూర్తిదాయకమని పలువురు పేర్కొన్నారు.ఈ ఘటనతో అనిత ప్రజాసేవలో మాత్రమే కాకుండా మానవత్వంలోనూ ఎంతో ముందున్నారు అని మరొకసారి నిరూపించారు. ప్రజలు ప్రతీ సందర్భంలో బాధితులకు సత్వర సహాయం అందించేలా ప్రేరణ పొందాలని హోంమంత్రి అనిత చూపిన దృక్పథం అందరికీ మార్గదర్శకంగా నిలవాలని సూచిస్తున్నారు.