Anil Kumar Singhal: గవర్నర్ ముఖ్య కార్యదర్శిగా అనిల్ సింఘాల్

ఏపీ గవర్నర్ ముఖ్య కార్యదర్శిగా అనిల్‌ కుమార్‌ సింఘాల్‌ను (Anil Kumar Singhal) రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. ప్రస్తుతం ఆ పదవిలో కొనసాగుతున్న రాంప్రకాష్‌ సిసోడియాను సాధారణ పరిపాలన శాఖ (GAD)లో రిపోర్ట్‌ చేయాలని సీఎస్ జవహర్ రెడ్డి ఆదేశించారు.

Published By: HashtagU Telugu Desk
Anil Kumar Singhal

Resizeimagesize (1280 X 720) (4) 11zon

ఏపీ గవర్నర్ ముఖ్య కార్యదర్శిగా అనిల్‌ కుమార్‌ సింఘాల్‌ను (Anil Kumar Singhal) రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. ప్రస్తుతం ఆ పదవిలో కొనసాగుతున్న రాంప్రకాష్‌ సిసోడియాను సాధారణ పరిపాలన శాఖ (GAD)లో రిపోర్ట్‌ చేయాలని సీఎస్ జవహర్ రెడ్డి ఆదేశించారు. ఇంతకు ముందు అనిల్ సింఘాల్ దేవదాయశాఖ ముఖ్య కార్యదర్శిగా ఉన్నారు.

Also Read: Bhuma Akhila Priya: మాజీ మంత్రి భూమా అఖిలప్రియ హౌస్ అరెస్ట్.. ఆళ్లగడ్డలో టెన్షన్.. టెన్షన్

సీనియర్ ఐఏఎస్ అధికారి, టీటీడీ మాజీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ ఆంధ్రప్రదేశ్ గవర్నర్ కార్యదర్శిగా నియమితులయ్యారు. రామ్ ప్రకాష్ సిసోడియా స్థానంలో ఆయన బాధ్యతలు స్వీకరించనున్నారు. సాధారణ పరిపాలన విభాగానికి రిపోర్టు చేయాల్సిందిగా రామ్‌ప్రకాష్‌ను కోరింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్‌రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం కార్యదర్శిగా నియామకం అయిన అనిల్ సింఘాల్ దేవాదాయశాఖ ముఖ్య కార్యదర్శిగా పనిచేస్తున్నారు. ఆయన బాధ్యతలను హరిజవహర్ లాల్ కు అదనపు బాధ్యతలుగా అప్పగించారు.

 

  Last Updated: 04 Feb 2023, 11:06 AM IST