Site icon HashtagU Telugu

Wedding Cancel: కాసేపట్లో మూడు ముళ్ళు.. వరుడి బట్టతలను చూసి పెళ్లి రద్దు చేసుకున్న వధువు!!

Wedding

Wedding

వివాహ వేడుక కన్నుల పండువగా జరుగుతోంది. కాసేపు అయితే పెళ్లి పూర్తవుతుంది. వారిద్దరూ ఒకటి అవుతారు. ఇంతలో పెళ్లి కొడుకుకు మైకం వచ్చి కుప్పకూలాడు. అతడిని చూసిన పెళ్లి కూతురు అయ్యో అనాల్సింది పోయి.. “ఆ” అని నోరు తెరిచింది. కోపంతో ఊగిపోయింది. ఎందుకలా చేసింది అంటే.. పెళ్లి కొడుకు తలపై అమర్చుకున్న విగ్గు ఊడిపోయింది.

“బట్ట తల విషయాన్ని దాచి.. నాకు అతన్ని కట్టబెడతారా? ఈ పెళ్లి చేసుకోను” అని పెళ్లి కూతురు అందరి ముందే భీష్మించింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లోని ఉన్నావ్ పట్టణంలో చోటుచేసుకుంది. దీంతో పెళ్లి కూతురు, పెళ్లి కొడుకు తరఫు వర్గాలు వెంటనే పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కాయి. వరుడికి బట్టతల ఉన్న విషయాన్ని అతడి తల్లిదండ్రులు దాచారని తేలింది. పోలీసులు, పెద్దలు ఎంతగా నచ్చజెప్పినా బట్టతల ఉన్న వరుడిని పెళ్లి చేసుకోనని వధువు తేల్చి చెప్పింది.

పెళ్లి కోసం వధువు తల్లిదండ్రులు రూ.5.66 లక్షలు ఖర్చు చేశారని, వాటిని తిరిగి ఇచ్చేయాలని పెద్దలు తీర్పు చెప్పారు. మోసం అభియోగాలను ఎదుర్కొన్న పెళ్లి కొడుకు కుటుంబం ఇక చేసేది లేక రూ.5.66 లక్షలను వధువు ఫ్యామిలీకి ఇచ్చేసింది. ఖాళీ చేతులతో తమ సొంతూరు కాన్పూర్ కు వెళ్లిపోయారు. పెళ్లి కొడుకు వాళ్లు ముందే నిజానిజాలు చెప్పి ఉంటే బాగుండేదని పలువురు వ్యాఖ్యానించారు.

Exit mobile version