ఏపీలో భారీ వరదలు తీవ్ర నష్టాన్ని మిగిల్చాయి. ఇప్పటికే వేలాది మంది ప్రజలు తేరుకోలేకపోతున్నారు. కూడు, గూడు, గుడ్డ కుసైతం ఇతరులపై ఆధారపడాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ తన విఛక్షణాధికారాలతో రెడ్‌క్రాస్‌కు రూ.25లక్షల నిధులు సమకూర్చారు. వాటితో వరద బాధితుల సహాయార్థం సామగ్రిని సిద్ధం చేశారు. ఇందుకు సంబంధించిన లారీలను శుక్రవారం గవర్నర్ జెండా ఊపి ప్రారంభించారు. తొలి విడతగా వెయ్యి కుటుంబాల కోసం సామగ్రిని సిద్ధం చేశారు. కడప, నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో వీటిని రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో పంపిణీ చేయనున్నారు.
AP Governor : వరద బాధితులకు గవర్నర్ చేయూత

Admin Ajax Imresizer