Andhra Woman: వివాహేతర సంబంధం.. మహిళా వాలంటీర్ హత్య!

రోజురోజుకూ వివాహేతర సంబంధాలు పెరిగిపోతున్నాయి. దీంతో పచ్చని సంసారాలు నాశనమవుతున్నాయి.

  • Written By:
  • Updated On - May 16, 2022 / 01:35 PM IST

రోజురోజుకూ వివాహేతర సంబంధాలు పెరిగిపోతున్నాయి. దీంతో పచ్చని సంసారాలు నాశనమవుతున్నాయి. వివాహేతర సంబంధం కారణంగా ఏపీలోని ఓ గ్రామ వాలంటీర్ ప్రాణం కోల్పోవాల్సి వచ్చింది. ఆంధ్రప్రదేశ్‌లోని బాపట్ల జిల్లాలో మహిళా గ్రామ వాలంటీర్‌ను ఓ వ్యక్తితో గతంలో వివాహేతర సంబంధం పెట్టుకుంది. వేమూరు మండలం చావలి గ్రామంలో ఆదివారం సాయంత్రం డి.శారద (27) ఇంటి ముందే హత్య కు గురైంది. మహిళ ఇంటిని శుభ్రం చేస్తుండగా పద్మారావు అనే వ్యక్తి కత్తితో దాడి చేశాడు. ఆమె ప్రాణాల రక్షణ కోసం పరుగులు తీయగా.. ఆమెను వెంబడించి మరి మెడపై కత్తితో పొడిచి ద్విచక్ర వాహనంపై పరారయ్యాడు. దీంతో బాధితురాలు అక్కడికక్కడే మృతి చెందింది.

పద్మారావుపై మహిళ తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడి కోసం గాలింపు ప్రారంభించారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. 2008లో శారదకు అదే గ్రామానికి చెందిన వ్యక్తితో వివాహమై ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. అయితే నాలుగేళ్ల క్రితం పద్మారావుతో ఆమెకు స్నేహం ఏర్పడటంతో సన్నిహిత సంబంధానికి దారి తీసింది. ఈ విషయం శారద భర్తకు తెలిసింది. పద్మారావును కలవకూడదని ఒత్తిడి చేయడంతో శారద పూర్తిగా దూరమైంది. శారద ప్రవర్తనలో మార్పు రావడంతో ఆగ్రహం చెందిన పద్మారావు ఆరు నెలల క్రితం గ్రామ సచివాలయం దగ్గర ఆమెను చెప్పుతో కొట్టాడు. పోలీసులకు ఫిర్యాదు చేయగా, నిందితుడిని హెచ్చరించి వదిలేశారు. అయితే సన్నిహిత సంబంధాన్ని కొనసాగించకపోవడంతో పద్మారావు మహిళపై పగ తీర్చుకోవాలని భావించి ఆదివారం ఆమెను కత్తితో పొడిచి హత్య చేశాడు. సంక్షేమ పథకాల కింద ప్రజలకు చేరవేసుందుకుగానూ ఏపీ రాష్ట్ర ప్రభుత్వం 2019లో గ్రామ వాలంటీర్ వ్యవస్థను ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే.