Duggirala MPP: దుగ్గిరాల ఎంపీపీ పీఠం వైసీపీదే

ఉత్కంఠ‌గా సాగిన దుగ్గిరాల ఎంపీపీ ఎన్నిక ఎన్నో హైడ్రామ‌ల మ‌ధ్య ముగిసింది.

  • Written By:
  • Publish Date - May 5, 2022 / 06:30 PM IST

ఉత్కంఠ‌గా సాగిన దుగ్గిరాల ఎంపీపీ ఎన్నిక ఎన్నో హైడ్రామ‌ల మ‌ధ్య ముగిసింది. ఎంపీపీ ప‌ద‌విని వైసీపీ ద‌క్కించుకోగా, రెండు వైఎస్ ఎంపీపీ ప‌ద‌వులు టీడీపీ, జ‌న‌సేన‌కు ద‌క్కాయి. కోఆప్ష‌న్ మెంబ‌ర్‌గా టీడీపీ నుంచి వ‌హిదుల్లా ఎన్నికైయ్యారు. గతేడాది జరిగిన ఎంపీటీసీ ఎన్నికల్లో వైసీపీ కంటే టీడీపీకి మెజారిటీ స్ధానాలు లభించినా అధికార పార్టీ ఎత్తులకు పై ఎత్తులు వేసి ఈ ఎన్నికను తమవైపు మలచుకుంది. దీంతో వైసీపీ ఎంపీపీ అభ్యర్ధిగా నిలబెట్టిన సంతోషి రూపవాణి ఇవాళ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మొత్తం 18 సీట్లకు గానూ టీడీపీకి 9, వైసీపీకి 8, జనసేనకు 1 సీటు దక్కింది.

ఎంపీపీ స్థానం బీసీ మహిళకు రిజర్వ్ అయింది. అయితే టీడీపీ నుంచి షేక్ జ‌బీన్ కు బీసీ స‌ర్టిఫికేట్ ఇవ్వ‌కపోవ‌డంతో ఆ పార్టీలో మ‌రో బీసీ మ‌హిళ లేక‌పోవ‌డంతో ఎంపీపీ స్థానం ద‌క్కించుకోలేక‌పోయింది. అయితే వైసీపీ నుంచి ఎంపీపీ ప‌ద‌వి ఆశిస్తున్న దుగ్గిరాల ఎంపీటీసీ 2 ప‌ద్మావ‌తి టీడీపీ మ‌ద్ద‌తుతో ప‌దవి చేప‌ట్టాల‌ని భావిస్తుండ‌టంతో అధికార‌పార్టీ ఆమెను క్యాంప్‌లోనే ఉంచింది. నిన్న ఎమ్మెల్యే ఆర్కేతో పాటు క్యాంప్ కు వెళ్లిన ఎద్మావతి ఇవాళ ఎన్నికకు గైర్హాజరయ్యారు. చివరికి కేవలం ఐదుగురు సభ్యుల మద్దతు మాత్రమే ఉన్న వైసీపీ ఎంపీటీసీ సంతోషి రూపవాణి మినహా మరో అభ్యర్ధి మూడు పార్టీల్లోనూ దొరకలేదు. దీంతో ఏకైక బీసీ మహిళ అయిన రూపవాణి ఎన్నిక ఏకగ్రీవంగా ఎన్నికైంది.