Site icon HashtagU Telugu

AP Winter: ఏజెన్సీని వ‌ణికిస్తున్న చ‌లి… మ‌రో మూడు రోజుల్లో…?

cold wave

cold wave

ఏపీలో రోజురోజుకి ఉష్ణోగ్ర‌త‌లు తగ్గుముఖం పడుతున్నాయి.ముఖ్యంగా ఏజెన్సీలో మ‌రో మూడు రోజుల్లో చలిగాలులు మరింత పెరిగే అవకాశం ఉంది. అన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే సగటున 2 నుంచి 4 డిగ్రీలు తగ్గుముఖం పట్టడంతో ఆంధ్రప్రదేశ్ అంతటా చలి తీవ్రత పెరిగింది. ఈ సమయంలో సాధారణ కనిష్ట ఉష్ణోగ్రతలు 17 నుండి 22 డిగ్రీల వరకు ఉంటాయి. సముద్ర మట్టానికి 18 కి.మీ ఎత్తులో తక్కువ ఎత్తులో ఈశాన్య గాలులు వీచడంతో చలిగాలులు తీవ్రరూపం దాల్చాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. రానున్న వారం రోజుల్లో చలి తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని… 15 రోజుల పాటు దీని ప్రభావం రాష్ట్రంపై ఎక్కువగా ఉంటుందని వాతావరణ శాఖ పేర్కొంది. విజయనగరం, శ్రీకాకుళం, విశాఖపట్నం, తూర్పుగోదావరి, కృష్ణా, గుంటూరు, కర్నూలు, అనంతపురం జిల్లాల్లో బలమైన గాలులు వీస్తాయని తెలిపింది. ఇదిలా ఉండగా…విశాఖపట్నంలో వారంలో కనిష్ట కనిష్ట ఉష్ణోగ్రత శనివారం చింతపల్లిలో 5.6 డిగ్రీల కనిష్టంగా నమోదైంది.

Exit mobile version