Site icon HashtagU Telugu

Biometric: టీచర్లపై గురి పెట్టిన ఏపీ సర్కార్.. బ‌యోమెట్రిక్ త‌ప్ప‌నిస‌రి..?

19vjpg6 Ehazar Imresizer

19vjpg6 Ehazar Imresizer

ఏపీలో ఆందోళన చేస్తున్న టీచర్లపై జగన్ సర్కార్‌ గురి పెట్టింది. బుధవారం నుంచి బయోమెట్రిక్‌ తప్పనిసరి చేయాలంటూ ఆదేశాలు జారీ చేసింది. ఈ -హాజరులో టీచర్ల అటెండెన్స్‌ని సాయంత్రానికి పంపాలని హుకుం జారీ చేసింది. డిప్యూటీ డీఈవోలు, ఎంఈవోలకు ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. పీఆర్సీపై ఉపాధ్యాయులు ఆందోళన కొనసాగిస్తున్నారు. ప్రత్యేక జేఏసీ ఏర్పాటు చేసుకోవాలని ఉపాధ్యాయ సంఘాలు యోచిస్తున్నాయి. దీంతో టీచర్ల ఆందోళనలపై ఒత్తిడి తీసుకురావాలని సర్కార్‌ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు బుధవారం నుంచి బయోమెట్రిక్‌ తప్పనిసరంటూ అధికారులు ఆదేశాలు జారీ చేశారు.