Site icon HashtagU Telugu

AP CS: కరోనా వల్ల ప్రభుత్వ ఆదాయం బాగా తగ్గింది!

Cs

Cs

కరోనా వైరస్ వల్ల ప్రభుత్వ ఆదాయం బాగా తగ్గిపోయిందని ఆంధ్రప్రదేశ్‌ సీఎస్‌ సమీర్‌ శర్మ అన్నారు. థర్డ్ వేవ్‌ వల్ల మరింత నష్టం జరిగే పరిస్థితి కనిపిస్తోందని,  ఏపీలోనే ఉద్యోగుల జీతాల బడ్జెట్‌ ఎక్కువగా ఉందని తెలిపారు. ఆర్థిక సమస్యలు ఉన్నప్పుడు ప్రభుత్వం ఉద్యోగుల జీతాలు, సంక్షేమ పథకాలు బ్యాలెన్స్‌ చేసుకోవాలని ఈ సందర్భంగా పేర్కొన్నారు. కరోనా కష్ట​కాలంలో కూడా ఉద్యోగులకు ఐఆర్‌ ఇచ్చామని, కరోనా లేకపోతే రాష్ట్ర రెవెన్యూ రూ.98 వేల కోట్లు ఉండేదని వెల్లడించారు. పీఆర్సీ ఆలస్యం అవుతుందనే ఐఆర్‌ ఇచ్చామని, కరోనా కారణంగా రాష్ట్ర రెవెన్యూ రూ.62 వేల కోట్లే ఉందని గుర్తుచేశారు. కరోనా సంక్షోభంతో రాష్ట్ర ఆదాయం పడిపోయిందని, కొత్త పీఆర్సీతో ఎవరి జీతాలు తగ్గవు అని ఏపీ సీఎస్ అభిప్రాయపడ్డారు.

Exit mobile version